చంద్రబాబుకు ఉండవల్లి ఘాటు లేఖ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ రాశారు. బంద్‌లు చేయడం తప్పని దాని వల్ల ఉపయోగం ఉండదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి తన లేఖలో ఖండించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంద్‌లకు పిలుపునిచ్చిన సంగతి మరిచారా బాబు అని ప్రశ్నించారు. బంద్‌లు చేయడం వృథా అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాది క్రితం జరిగిన విశాఖ ఏజెన్సీ బంద్‌కు టీడీపీ కూడా మద్దతిచ్చిందని లేఖలో ఉండవల్లి గుర్తు చేశారు. ప్రత్యేక హోదా […]

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ రాశారు. బంద్‌లు చేయడం తప్పని దాని వల్ల ఉపయోగం ఉండదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి తన లేఖలో ఖండించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంద్‌లకు పిలుపునిచ్చిన సంగతి మరిచారా బాబు అని ప్రశ్నించారు. బంద్‌లు చేయడం వృథా అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏడాది క్రితం జరిగిన విశాఖ ఏజెన్సీ బంద్‌కు టీడీపీ కూడా మద్దతిచ్చిందని లేఖలో ఉండవల్లి గుర్తు చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ తీవ్రత కేంద్రానికి అర్థం కావాలంటే బంద్ చేయడం సరైన మార్గమేనన్నారు. హోదా తీవ్రత కేంద్రానికి అర్థమయ్యేలా ఆగస్ట్ 2న జరిగే రాష్ట్ర బంద్‌కు ప్రభుత్వం కూడా మద్దతివ్వాలని ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు.
Click on Image to Read: