Telugu Global
NEWS

"పేపర్ క్లిప్పింగ్స్‌ సేకరణ"- టీడీపీ మీడియాకు కమలనాథుల కౌంటర్

ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయిన వేళ ఆయన్నుమీడియా జాకీల సాయంతో తిరిగి పైకి లేపేందుకు టీడీపీ అనుకూల మీడియా చాలా కష్టపడుతోంది. చంద్రబాబు కోసం అత్యంత ఉత్సాహంగా పనిచేసే ఒక ఛానల్‌ తాజాగా కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఫైర్ అయిన తీరు చూసి కేంద్రం కూడా పునరాలోచనలో పడిందట. చంద్రబాబు ఆగ్రహాన్ని గమనించిన మోదీ …. చంద్రబాబు ప్రెస్‌మీట్‌కు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్‌లను తెప్పించుకుని పరిశీలించారని బాబు […]

పేపర్ క్లిప్పింగ్స్‌ సేకరణ- టీడీపీ మీడియాకు కమలనాథుల కౌంటర్
X

ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయిన వేళ ఆయన్నుమీడియా జాకీల సాయంతో తిరిగి పైకి లేపేందుకు టీడీపీ అనుకూల మీడియా చాలా కష్టపడుతోంది. చంద్రబాబు కోసం అత్యంత ఉత్సాహంగా పనిచేసే ఒక ఛానల్‌ తాజాగా కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఫైర్ అయిన తీరు చూసి కేంద్రం కూడా పునరాలోచనలో పడిందట. చంద్రబాబు ఆగ్రహాన్ని గమనించిన మోదీ …. చంద్రబాబు ప్రెస్‌మీట్‌కు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్‌లను తెప్పించుకుని పరిశీలించారని బాబు ఛానల్ కథనం. అమిత్‌ షాకు కూడా ఫోన్ చేసిన మోదీ … టీడీపీని ఎవరూ విమర్శించకుండా చూడాలని ఆదేశించారట. త్వరలోనే చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుని పరిస్థితి వివరించి శాంతపరిచే ఆలోచనలో మోదీ ఉన్నారని ఛానల్ కథనం. అయితే బీజేపీలోని ఒక వర్గం మాత్రం చంద్రబాబు అనుకూల ఛానల్‌ కథనాలను కొట్టిపారేస్తున్నారు.

చంద్రబాబు ప్రెస్‌ మీట్ పేపర్ క్లిప్పింగ్స్‌ను అనువాదం చేయించుకుని మోదీ పరిశీలించిన మాట నిజమేనంటున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల కామెంట్లకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లను కూడా తెప్పించుకున్నారని చెబుతున్నారు. టీడీపీ నేతలు బీజేపీని ఏ విధంగా స్థానికంగా దూషిస్తూ, ఏపీలో పార్టీని దెబ్బకొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను గమనించేందుకే మోదీ… పేపర్‌ క్లిప్పింగులు సేకరించారని చెబుతున్నారు. చంద్రబాబు అనుకూల ఛానల్ చెబుతున్నట్టు బాబుకు భయపడి మోదీ ప్లేపర్ క్లిప్పింగ్‌లను సేకరించడం లేదని కమలనాథుల వాదన. ఢిల్లీ రాజకీయాలను గమనిస్తున్న వారు కూడా బీజేపీ నేతలు చెబుతున్న దానిలోనే ఎక్కువ వాస్తవం ఉందంటున్నారు. ఎందుకంటే చాలా కాలంగా ఢిల్లీ స్థాయిలో బీజేపీని పొగుడుతూనే… రాష్ట్రంలో మాత్రం ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని మాత్రమే దోషిగా చిత్రీకరించేందుకు టీడీపీ నేతలు, దాని అనుకూల మీడియా వేస్తున్న వేషాలు మోదీ దృష్టికి ఇదివరకే వెళ్లాయంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు, టీడీపీ నేతల ప్రెస్‌ మీట్ల క్లిప్పింగ్స్‌ను మోదీ సేకరించిన మాట మాత్రం వాస్తవమని ఇరువర్గాలు ఒప్పుకుంటున్నాయి. అయితే ఆ పేపర్ క్లిప్పింగ్‌లను ఎందుకు సేకరించారన్న దానిపైనే భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఢిల్లీకి వచ్చి బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకునే చంద్రబాబు రాష్ట్రంలో మాత్రం బీజేపీ తనను చూసి భయపడుతున్నట్లుగా తన మీడియాలో కలర్ ఇచ్చుకోవడం రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే వారు ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకురావడం వల్లే నిజానిజాలను తెలుసుకునేందుకు మోదీ ఆ వార్తలను అనువాదం చేయించుకొని చూశారని రాష్ట్ర బీజేపీలో చంద్రబాబును వ్యతిరేకించే వ్యక్తులు చెబుతున్నారు.

First Published:  31 July 2016 10:01 AM GMT
Next Story