చంద్రబాబు "డైలాగ్"కు పిల్లర్ కట్టిన తమ్ముళ్లు
విజయవాడలో వైఎస్ విగ్రహాన్ని చంద్రబాబు కూల్చివేయించి ఆ పనిని సమర్ధించుకున్నారు. రోడ్డు ఉన్నది వాహనాలు వెళ్లడానికి విగ్రహాలు పెట్టుకోవడానికి కాదు… కావాలంటే విగ్రహాలను ఇళ్ల దగ్గర పెట్టుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు. కానీ ఎప్పటి లాగే టీడీపీ పచ్చపాతం మాత్రం 24గంటలు కూడా గడవకముందే బయటపడింది. విగ్రహాలు ఇళ్లలో పెట్టుకోవాలంటూ చంద్రబాబు చెప్పిన రోజే తెలుగు తమ్ముళ్లు నడిరోడ్డుపై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రెడీ అయ్యారు. అమరావతి మెయిన్ రోడ్డుపై రాత్రికి రాత్రే కాంక్రీట్ పిల్లర్ వేశారు. ఆదివారం […]
విజయవాడలో వైఎస్ విగ్రహాన్ని చంద్రబాబు కూల్చివేయించి ఆ పనిని సమర్ధించుకున్నారు. రోడ్డు ఉన్నది వాహనాలు వెళ్లడానికి విగ్రహాలు పెట్టుకోవడానికి కాదు… కావాలంటే విగ్రహాలను ఇళ్ల దగ్గర పెట్టుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు. కానీ ఎప్పటి లాగే టీడీపీ పచ్చపాతం మాత్రం 24గంటలు కూడా గడవకముందే బయటపడింది. విగ్రహాలు ఇళ్లలో పెట్టుకోవాలంటూ చంద్రబాబు చెప్పిన రోజే తెలుగు తమ్ముళ్లు నడిరోడ్డుపై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రెడీ అయ్యారు.
అమరావతి మెయిన్ రోడ్డుపై రాత్రికి రాత్రే కాంక్రీట్ పిల్లర్ వేశారు. ఆదివారం కావడంతో అధికారులు ఎవరూ రారు కాబట్టి ఆఘమేఘాల మీద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు రెడీ అయిపోయారు. తెల్లవారయ్యే సరికి భారీ పిల్లర్ జనానికి దర్శనమిచ్చింది. దీంతో జనం కంగుతిన్నారు. నిన్ననే కదా రోడ్లు ఉన్నది జనం కోసమే గానీ… విగ్రహాల కోసం కాదని చంద్రబాబు నీతులు చెప్పారు… ఇంతలోనే మెయిన్ రోడ్డుపై అందులోనూ ఇరుకుగా ఉండే రోడ్డుపై ఎన్టీఆర్ విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్థలం కూడా చంద్రబాబు ఇప్పుడు నివాసముంటుందన్న ఇంటికి దగ్గర్లోనే ఉంది. అంతే మరీ ప్రత్యేక హోదా సెగ దెబ్బకు కిందపైనా కాలుతోంది… జనాన్ని ఆ అంశం నుంచి తప్పుదారి పట్టించాలంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ను నమ్ముకోక తప్పదు మరి.
Click on Image to Read: