విడుదలకు ముందే చంద్రబాబు కొత్త ప్లాన్ లీక్!
” రేయ్ నేను నిన్ను కొట్టినట్లు చేస్తా.. నువ్వు దెబ్బలు తగిలి విలవిల్లాడిపోవాలి.. అది చూసి చిలక ఒళ్లో వాలాలి. సరేనా..?” పాత సినిమాలో అమాయక హీరోయిన్లను మోసగించడానికి హీరో తన అనుచరుడితో వాడే డైలాగ్ ఇది. ఈ తతంగాన్ని దూరం నుంచి గమనిస్తున్న హీరోయిన్ మీ కథ మాకు ముందే తెలుసులే అంటే ఎలా ఉంటుంది? హీరో ముఖం కందగడ్డలా ఎర్రగా మారిపోదా? ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. తెలంగాణలో పార్టీ […]
BY sarvi31 July 2016 3:38 AM IST
X
sarvi Updated On: 31 July 2016 5:01 AM IST
” రేయ్ నేను నిన్ను కొట్టినట్లు చేస్తా.. నువ్వు దెబ్బలు తగిలి విలవిల్లాడిపోవాలి.. అది చూసి చిలక ఒళ్లో వాలాలి. సరేనా..?” పాత సినిమాలో అమాయక హీరోయిన్లను మోసగించడానికి హీరో తన అనుచరుడితో వాడే డైలాగ్ ఇది. ఈ తతంగాన్ని దూరం నుంచి గమనిస్తున్న హీరోయిన్ మీ కథ మాకు ముందే తెలుసులే అంటే ఎలా ఉంటుంది? హీరో ముఖం కందగడ్డలా ఎర్రగా మారిపోదా? ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. తెలంగాణలో పార్టీ నాశనమైపోయింది.. ఇక ఏపీలో ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది.. ఇప్పుడేం చేయాలి? దీనికి కారణం బీజేపీ తో దోస్తీ చేయడమే. ఇటు తెలంగాణలో విభజన సమస్యలు పరిష్కరించడం లేదు. అటు ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. అలాగని బీజేపీతో దోస్తీ ని వదులుకోలేని పరిస్థితి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప‌్రజల ముందు ఏదో డ్రామా ఆడాలి? ఏం చేయాలి? అని ఆలోచించిన తెలుగుదేశం నేతలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పచ్చ పత్రికలు నెత్తికెత్తుకున్నాయి. ఏపీ ప్రత్యేక హోదా కోసం వీరి మైత్రి బంధం చెడిపోయేలా ఉంది అన్నట్లుగా వార్తలు రాయడం మొదలు పెట్టేశాయి.
అంతా బాగానే ఉంది.. కానీ, టీడీపీ శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీకి పార్లమెంటులో భంగపాటు తప్పలేదు. ఈ విషయమై మాట్లాడుతున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరికి స్పీకర్ వేసిన ప్రశ్నలతో మతిపోయింది. మీరు కేంద్రమంత్రిగా మాట్లాడుతున్నారా? ప‌్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి ఇలా మాట్లాడకూడదు కదా? అంటూ చురకలంటించడంతో నాలిక కరుచుకున్నాడు చౌదరి. అంతే తూతూ మంత్రంగా ప్రసంగించి ముగించాడు. ఇక ప్రధాని సభలో నిరసన తెలపకముందే టీడీపీ నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో తెలంగాణ పోలీసులు ఉన్నారు. మరి, ఇక్కడన్నా ఈ మిత్రపక్షాల డ్రామా రక్తి కడుతుందో లేదో చూడాలి. అయినా విడుదలకు ముందే సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీకైతే.. ఆ సినిమా నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుంది? చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు ప్రత్యర్థి పార్టీల నాయకులు.
Next Story