అల్లుడి సినిమాకు రహమాన్ బాణీలు!
ఇండస్ట్రీలో వారసులు రావడం సహజమే! ఏఆర్ రహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కూడా మామ బాటలోనే సంగీత దర్శకుడిగా అడుగుపెట్టాడు. కానీ, ఆయన పూర్తికాలం సంగీత దర్శకుడిగా కొనసాగదలచుకోలేదు. అందుకే, కొంతకాలంగా హీరో పాత్రలు వేస్తున్నాడు. వాటిలో కొన్ని విజయం సాధించడంతో భారీ బడ్జెట్ నిర్మాతలు సైతం జీవి ప్రకాశ్‌తో సినిమాలకు ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడి అవతారం ఎత్తిన రాజీవ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు ప్రకాశ్. దీనికి సంగీతం తన మేనమామ […]
BY sarvi31 July 2016 5:31 AM IST

X
sarvi Updated On: 31 July 2016 8:10 AM IST
ఇండస్ట్రీలో వారసులు రావడం సహజమే! ఏఆర్ రహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కూడా మామ బాటలోనే సంగీత దర్శకుడిగా అడుగుపెట్టాడు. కానీ, ఆయన పూర్తికాలం సంగీత దర్శకుడిగా కొనసాగదలచుకోలేదు. అందుకే, కొంతకాలంగా హీరో పాత్రలు వేస్తున్నాడు. వాటిలో కొన్ని విజయం సాధించడంతో భారీ బడ్జెట్ నిర్మాతలు సైతం జీవి ప్రకాశ్‌తో సినిమాలకు ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడి అవతారం ఎత్తిన రాజీవ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడు ప్రకాశ్. దీనికి సంగీతం తన మేనమామ అయిన ఏఆర్ రహమాన్ అందిస్తుండటం విశేషం. ఈసినిమాలో మొత్తం 9 పాటలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే తన మేనల్లుడికి 4 స్వరాలు సిద్ధం చేశాడు. మిగిలిన 5 పాటలకూ బాణీలు కడుతున్నాడట. ఎంతైనా మామ- అల్లుళ్ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Next Story