వైఎస్ విగ్రహంపై ఘాటుగా బాబు స్పందన... పోయేకాలమేనన్న కేవీపీ
విజయవాడలో వైఎస్ విగ్రహం కూల్చివేతను చంద్రబాబు సమర్ధించుకున్నారు. రోడ్డు ఉన్నది విగ్రహాలు పెట్టుకోవడానికి కాదని… వాహనాలు, ప్రజలు వెళ్లేందుకన్నారు. అడ్డంగా ఉన్న విగ్రహాలను తొలిగిస్తే రాద్దాంతం ఎందుకని ప్రశ్నించారు. ఎవరైనా కావాలంటే విగ్రహాలను వారి ఇంటి దగ్గర పెట్టుకోమనండి అంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు. రోడ్లపై విగ్రహాలు పెట్టకుండా గతంలోనే చట్టం తెచ్చామన్నారు. అభిమానం ఉంటే గుండెళ్లో పెట్టుకోవాలే గానీ ఇలా విగ్రహాలు పెట్టకూడదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి గానీ విగ్రహాలు పెట్టకూడదన్న చంద్రబాబు […]
విజయవాడలో వైఎస్ విగ్రహం కూల్చివేతను చంద్రబాబు సమర్ధించుకున్నారు. రోడ్డు ఉన్నది విగ్రహాలు పెట్టుకోవడానికి కాదని… వాహనాలు, ప్రజలు వెళ్లేందుకన్నారు. అడ్డంగా ఉన్న విగ్రహాలను తొలిగిస్తే రాద్దాంతం ఎందుకని ప్రశ్నించారు. ఎవరైనా కావాలంటే విగ్రహాలను వారి ఇంటి దగ్గర పెట్టుకోమనండి అంటూ తీవ్ర వ్యాఖ్య చేశారు. రోడ్లపై విగ్రహాలు పెట్టకుండా గతంలోనే చట్టం తెచ్చామన్నారు. అభిమానం ఉంటే గుండెళ్లో పెట్టుకోవాలే గానీ ఇలా విగ్రహాలు పెట్టకూడదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి గానీ విగ్రహాలు పెట్టకూడదన్న చంద్రబాబు వ్యాఖ్య… ఎన్టీఆర్ విగ్రహాల విషయంలోనూ అమలు చేస్తారా?.
మరోవైపు వైఎస్ విగ్రహం కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ తీవ్రంగా తప్పుపట్టారు. పోయేకాలమే వ్యతిరేక బుద్ధికి దారి తీస్తుందన్నారు. వైఎస్ విగ్రహాన్ని అకారణంగా తొలగించారని విమర్శించారు. వైఎస్ విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ద్వారా నీరు తీసుకొచ్చామంటున్న చంద్రబాబుకు… ఆ నీరు వస్తున్న పోలవరం కుడి కాల్వను తవ్వింది వైఎస్సేనన్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు బీజేపీని నిలదీయాలి గానీ… కాంగ్రెస్‌ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ కుమ్మక్కై హోదా బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరగకుండా అడ్డుకున్నాయని కేవీపీ ఆరోపించారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇచ్చిన హామీని చంద్రబాబు, మోదీ నిలుపుకోవాలని డిమాండ్ చేశారు.
Click on Image to Read: