"మాకే సిగ్గేస్తోంది"- కుప్పం తమ్ముళ్ల రాజీనామాలు
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యంవహిస్తున్న కుప్పంలో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు విజన్ 2029, విజన్ 2050 అంటుంటే కుప్పం టీడీపీ నేతలు మాత్రం విజన్ 2016 సంగతి తేల్చండి అని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా కుప్పంలో అభివృద్ధి ఆగిపోయిందంటూ కుప్పం పట్టణ వార్డు సభ్యులు తిరుగుబాటు చేశారు. ఏకంగా 16మంది వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కుప్పంలో రెండేళ్లుగా ఎలాంటి పనులు చేయడం లేదని… పదవుల్లో కొనసాగేందుకు తమకే సిగ్గేసి […]
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యంవహిస్తున్న కుప్పంలో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు విజన్ 2029, విజన్ 2050 అంటుంటే కుప్పం టీడీపీ నేతలు మాత్రం విజన్ 2016 సంగతి తేల్చండి అని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా కుప్పంలో అభివృద్ధి ఆగిపోయిందంటూ కుప్పం పట్టణ వార్డు సభ్యులు తిరుగుబాటు చేశారు. ఏకంగా 16మంది వార్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కుప్పంలో రెండేళ్లుగా ఎలాంటి పనులు చేయడం లేదని… పదవుల్లో కొనసాగేందుకు తమకే సిగ్గేసి రాజీనామా చేస్తున్నామని వారు ప్రకటించారు.
కుప్పం కోసం విడుదలైన నిధులు ఎక్కడ ఖర్చుపెట్టారన్న దానిపై రెండేళ్లుగా లెక్కలు కూడా లేవని వారు ఆరోపించారు. డంపింగ్ యార్డు శుభ్రం చేయడం కోసం రూ.25లక్షలు ఎస్‌టీఎఫ్ నిధుల ద్వారా రూ.4.5 కోట్లు ఖర్చుపై ఇంత వరకు లెక్కలు చూపిన దాఖలాలు లేవన్నారు. ఆదాయ వ్యయాలు, ఆస్తుల వివరాలే లేకుండాపోయాయని ఆరోపించారు. పట్టణం మొత్తం డ్రైనేజ్ కంపు కొడుతోందని.. రోడ్లు దారుణంగా తయారయ్యాయని వారు వాపోయారు. ఈ పరిస్థితుల్లో పదవుల్లో ఉండడం కంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవడమే మేలంటూ 16మంది వార్డు సభ్యులు రాజీనామాలు చేశారు. తాను సొంత నియోజకవర్గానికి వెళ్లకపోయినా అక్కడి ప్రజలు అభిమానంతో తనను గెలిపిస్తున్నారని ఇటీవల చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. కుప్పం పట్టణానికి ఏమీ చేయకపోయినా ఓట్ల వర్షం కురుస్తుందన్న ఆ నమ్మకమే చంద్రబాబును ఈ విధంగా ముందుకు నడిపిస్తోంది కాబోలు.
Click on Image to Read: