చైర్‌పై మచ్చలు... పచ్చ కార్యక్రమంలో స్పీకర్
స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక ప్రత్యేకమైన స్పీకర్‌గా చరిత్రలో నిలిచిపోయేలాగే ఉన్నారు. స్పీకర్‌గా ఉంటూ కూడా ఆయన మాటలు, వ్యవహార శైలి పదేపదే వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయన వ్యవహారం చర్చనీయాంశమైంది. స్పీకర్‌గా ఉన్న వారు పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటారు. కానీ కోడెల మాత్రం పార్టీ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొనడమే కాదు… ఫిరాయింపు నేతలకు కండువాలు కూడా కప్పారు. ఈ విషయాన్ని కోడెలపై అవిశ్వాసం సందర్బంగా వైసీపీ నేతలు ఎండగట్టారు. స్పీకర్‌గా […]
స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒక ప్రత్యేకమైన స్పీకర్‌గా చరిత్రలో నిలిచిపోయేలాగే ఉన్నారు. స్పీకర్‌గా ఉంటూ కూడా ఆయన మాటలు, వ్యవహార శైలి పదేపదే వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయన వ్యవహారం చర్చనీయాంశమైంది. స్పీకర్‌గా ఉన్న వారు పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటారు. కానీ కోడెల మాత్రం పార్టీ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొనడమే కాదు… ఫిరాయింపు నేతలకు కండువాలు కూడా కప్పారు. ఈ విషయాన్ని కోడెలపై అవిశ్వాసం సందర్బంగా వైసీపీ నేతలు ఎండగట్టారు. స్పీకర్‌గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. అయినా కోడెల తీరు మారలేదు. తాజాగా అమెరికాలోని షార్లెట్ నగరంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నిర్వహించిన కార్యక్రమంలో కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. అంతేకాదు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. ఏపీకి ఒక దమ్మున్న నాయకత్వం ఉందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐలతో పాటు అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అయిన కోమటి జయరాం కూడా పాల్గొన్నారు.
గతంలోనూ స్పీకర్ ఒకసారి కమ్మ సామాజికవర్గానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరై… ఒక కులానికి అధికారం దక్కడంపై వ్యాఖ్యలు చేయడం ఆ విషయం పత్రికల్లో రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరో సందర్భంలో కమ్మ ప్రముఖుల విశేషాలతో రచించిన పుస్తకావిష్కరణకు హాజరైన కోడెల శివప్రసాదరావు… విదేశాల్లో మన కమ్మవారే అధికంగా ఉన్నారని పొగుడుకున్నారు. బెస్ట్ ఎన్నారై గ్రూప్ ఏదైనా ఉందంటే అది కమ్మ సామాజివర్గం గ్రూపేనని ఒక స్పీకర్‌గా ఉంటూ వ్యాఖ్యానించారు. ఇలా పవిత్రమైన స్పీకర్ స్థానంలో ఉంటూ ఒక పార్టీకి, ఒక కులానికి అనుకూలంగా మాట్లాడడంపై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల్లో గెలిచేందుకు 11. 5కోట్లు ఖర్చు పెట్టానని స్వయంగా కెమెరా ముందు చెప్పిన ఘనత కూడా స్పీకర్ హోదాలో కోడెలకే దక్కింది.
Click on Image to Read: