Telugu Global
Cinema & Entertainment

మిల్కీ బ్యూటీకి కాజల్ ఝలక్

ఒకరి అవకాశాలు మరొకరు ఎరేసుకుపోవడం ఇండస్ట్రీలో కామన్. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఇంకా కామన్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ రేంజ్ కు వచ్చిందంటే… చివరికి ఐటెంసాంగ్ అవకాశాల కోసం కూడా కుమ్ములాడుకుంటున్నారు. తమన్న-కాజల్ విషయంలో అదే జరిగింది. ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెంసాంగ్ కోసం తమన్నాను అనుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో… ఆమె స్థానంలోకి కాజల్ వచ్చేసింది. అలా తమన్నాకు ఎర్త్ పెట్టేసింది కలువ కాజల్. నిజానికి తమన్నా ఆల్ […]

మిల్కీ బ్యూటీకి కాజల్ ఝలక్
X

ఒకరి అవకాశాలు మరొకరు ఎరేసుకుపోవడం ఇండస్ట్రీలో కామన్. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది ఇంకా కామన్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ రేంజ్ కు వచ్చిందంటే… చివరికి ఐటెంసాంగ్ అవకాశాల కోసం కూడా కుమ్ములాడుకుంటున్నారు. తమన్న-కాజల్ విషయంలో అదే జరిగింది. ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెంసాంగ్ కోసం తమన్నాను అనుకున్నారు. అంతలోనే ఏమైందో ఏమో… ఆమె స్థానంలోకి కాజల్ వచ్చేసింది. అలా తమన్నాకు ఎర్త్ పెట్టేసింది కలువ కాజల్.

నిజానికి తమన్నా ఆల్ మోస్ట్ ఫైనల్ అనుకున్నారు.. ఒక్క పాట కోసం 50 లక్షలిచ్చేందుకూ రెడీ అయ్యారు. కానీ ఈలోగా అమ్మడికి వరుసగా కోలీవుడ్ లో రెండు మూడు సినిమాలు పడ్డాయి. బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. అయినప్పటికీ ఐటెంసాంగ్ కు ఓ 3 రోజులు టైం కేటాయించడానికి తమన్నా ఒప్పుకుంది. కానీ కాజల్ సీన్ లోకి ఎంటరైంది. తారక్ తో మాట్లాడి తను ఆ ఛాన్స్ కొట్టేసింది.

తమన్నాకు ఇవ్వజూపిన ఎమౌంట్ నే కాజల్ కు కూడా ఇస్తున్నారు. ఓ రకంగా కాజల్ ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇదే కాబోతోంది. అలాగే గతేడాదే తారక్ తో టెంపర్ లో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఒక్క యేడాదిలోనే అతడికి ఐటమ్ గా మారిందంటే ఇప్పుడు కాజల్ పరిస్థితేంటో ఊహించుకోవచ్చు.

First Published:  30 July 2016 3:48 PM IST
Next Story