Telugu Global
Cinema & Entertainment

కబాలి నష్టాల విలువ దాదాపు రూ.10 కోట్లు..

లాస్ట్ వీకెండ్ (జులై 22) ఘనంగా విడుదలైన కబాలి సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతంగా వసూళ్లు వస్తున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. 6 రోజుల్లో 3వందల కోట్ల రూపాయలు వచ్చాయని అంటున్నారు. కానీ తెలుగు నిర్మాతలు మాత్రం పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయారు. కబాలి విషయంలో వాళ్లు కోలుకునే అవకాశాలు ఇప్పుడు దాదాపు శూన్యం. ఎందుకంటే…  వారం రోజులు గడిచిపోయింది. కబాలి వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో […]

కబాలి నష్టాల విలువ దాదాపు రూ.10 కోట్లు..
X

లాస్ట్ వీకెండ్ (జులై 22) ఘనంగా విడుదలైన కబాలి సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతంగా వసూళ్లు వస్తున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. 6 రోజుల్లో 3వందల కోట్ల రూపాయలు వచ్చాయని అంటున్నారు. కానీ తెలుగు నిర్మాతలు మాత్రం పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయారు. కబాలి విషయంలో వాళ్లు కోలుకునే అవకాశాలు ఇప్పుడు దాదాపు శూన్యం. ఎందుకంటే… వారం రోజులు గడిచిపోయింది. కబాలి వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు క్లోజ్ అయిపోయాయి. తాజా లెక్కల ప్రకారం… వారం రోజుల్లో ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. కానీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాను దాదాపు 31 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. సో… తెలుగు రాష్ట్రాల్లో కబాలి నిర్మాతలకు దాదాపు 10కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నమాట. ఇక ప్రాంతాల వారీగా కబాలి వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం

నైజాం : రూ. 8.65 కోట్లు

సీడెడ్ : రూ. 3.30 కోట్లు

ఉత్తరాంధ్ర : రూ. 2.15 కోట్లు

గుంటూరు : రూ. 1.82 కోట్లు

ఈస్ట్ : రూ. 1.65 కోట్లు

కృష్ణా : రూ.1.42 కోట్లు

వెస్ట్ : రూ. 1.30 కోట్లు

నెల్లూరు : రూ. 0.71 కోట్లు

ఏపీ, తెలంగాణ మొత్తం : రూ 21 కోట్లు (షేర్)

First Published:  30 July 2016 6:36 AM IST
Next Story