"నిర్లజ్జగా కొనసాగుతున్నారు"- ఏపీ బంద్‌కు జగన్ పిలుపు
ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీల దుర్మార్గానికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కోరుకుంటున్న వారంతా ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని చంద్రబాబు అన్న తర్వాతే కేంద్రం ఈ విధంగా వ్యవహరిస్తోందని జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం వీలు కాదని అరుణ్ జైట్లీ చెప్పిన తర్వాత కూడా నిర్లజ్జగా కేంద్రంలో కొనసాగేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారని […]
ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ బంద్‌కు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీల దుర్మార్గానికి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కోరుకుంటున్న వారంతా ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని చంద్రబాబు అన్న తర్వాతే కేంద్రం ఈ విధంగా వ్యవహరిస్తోందని జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం వీలు కాదని అరుణ్ జైట్లీ చెప్పిన తర్వాత కూడా నిర్లజ్జగా కేంద్రంలో కొనసాగేందుకు చంద్రబాబు నిర్ణయించుకున్నారని జగన్ మండిపడ్డారు.
తనపై కేసులు లేకుండా ఉంటే చాలు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహారం ఉందని జగన్ ఒక ప్రకటనలో విమర్శించారు. 5కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఏపీ ప్రజల భవిష్యత్తుతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా బీజేపీ, టీడీపీ ఆడుతున్న నాటకం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు జగన్.
Click on Image to Read: