Telugu Global
NEWS

ఇరుకున పడ్డా... కళ్ల సిద్ధాంతంతో నెట్టుకొచ్చిన సుజనా

ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. చర్చలో మాట్లాడిన కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఎప్పటిలాగే కళ్ల సిద్ధాంతాన్ని వినిపించారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతుండగా అడ్డుపడి కథను రక్తికట్టించారు.  సుజనాచౌదరి కేంద్రమంత్రిగా మాట్లాడుతున్నారా టీడీపీఎంపీగా మాట్లాడుతున్నారా చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో సుజనా చౌదరి ఇరుకునపడ్డారు. అయితే విపక్షాల ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే సుజనా ప్రసంగం సాగింది. రాష్ట్ర విభజనను టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని సుజనా చౌదరి చెప్పారు. అయితే సరైన […]

ఇరుకున పడ్డా... కళ్ల సిద్ధాంతంతో నెట్టుకొచ్చిన సుజనా
X

ప్రత్యేక హోదా ప్రైవేట్ బిల్లుపై రాజ్యసభలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. చర్చలో మాట్లాడిన కేంద్రమంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఎప్పటిలాగే కళ్ల సిద్ధాంతాన్ని వినిపించారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతుండగా అడ్డుపడి కథను రక్తికట్టించారు. సుజనాచౌదరి కేంద్రమంత్రిగా మాట్లాడుతున్నారా టీడీపీఎంపీగా మాట్లాడుతున్నారా చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో సుజనా చౌదరి ఇరుకునపడ్డారు. అయితే విపక్షాల ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే సుజనా ప్రసంగం సాగింది.

రాష్ట్ర విభజనను టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని సుజనా చౌదరి చెప్పారు. అయితే సరైన దారిలో విభజన జరగలేదని… అసెంబ్లీ తీర్మానాన్ని వ్యతిరేకించి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని విమర్శించారు. రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని టీడీపీ చెప్పినా… బీజేపీ,కాంగ్రెస్ అలా చేయలేదని తప్పుపట్టారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగానే ఉంటూ ప్రత్యేక హోదా ఇవ్వాలని, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అయితే అలా చేయని పక్షంలో టీడీపీ ఏంచేస్తుందన్నది మాత్రం ఆయన చెప్పలేదు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ… నిద్ర పోతున్నట్టు నటించేవాడిని లేపలేమన్న సుజనా చౌదరి… హోదా విషయంలో కేంద్రం తీరు ఇలాగే ఉందని వ్యాఖ్యానించారు.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఏపీకి చేసిన సాయాన్ని వివరిస్తుండగా సుజనా చౌదరి అడ్డుపడ్డారు.దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక కేంద్రమంత్రి మాట్లాడుతుండగా తోటి కేంద్రమంత్రి అడ్డుపడడం ఏమిటనిప్రశ్నించారు. ఇది అసాధారణ పరిణామం అన్నారు. సుజనా అడ్డుపడడంతో జైట్లీ కూడా నొచ్చుకున్నట్టు కనిపించింది. వెంటనే సుజనాకూడావెనక్కు తగ్గారు.

మొత్తం మీద తాను కేంద్రమంత్రిగా మాట్లాడుతున్నారా లేక టీడీపీ ఎంపీగా మాట్లాడుతున్నారా, కేంద్రం వైఖరికి అనుకూలంగా మాట్లాడుతున్నారా లేక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అన్న క్లారిటీ లేకుండానే సుజనా సభలో వ్యవహరించారు.

Click on Image to Read:

jc-prabhakar-reddy

chandrababu naidu arun jaitly

ysrcp-tdp-mla's

lokesh

ttdp

ke-krishnamurthy

pulla-rao

liquor-sales

pelli-choopulu-movie-review

vijayasai-reddy

lokesh-comments

jaleel-khan

srichaitanya eamcet paper leak

First Published:  29 July 2016 11:53 AM IST
Next Story