పారితోషికంలో జాకీచాన్‌ని మించిన రజినీ
కబాలి సినిమాకు హీరో రజినీకాంత్‌కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.80 కోట్లు. పైరసీ భూతం పట్టి పీడిస్తున్న ఈరోజుల్లో హిట్ సినిమాకు ఈ మాత్రం వసూళ్లు వచ్చినా చాలు అనుకునే రోజులివి. అలాంటిది.. తలైవా పారితోషికం విని కళ్లు తిరిగి పడిపోతున్నారంట చిన్న నిర్మాతలు. ఈ సినిమా కోసం ముందుగా నిర్మాతలతో రజినీకి ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే..? సినిమాకు ముందు రజినీకి రూ.35 కోట్లు పారితోషికం ఇచ్చారు. సినిమా విడుదలైన తరువాత వచ్చే లాభాల్లో.. […]
BY sarvi29 July 2016 8:01 AM IST
X
sarvi Updated On: 29 July 2016 8:44 AM IST
కబాలి సినిమాకు హీరో రజినీకాంత్‌కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.80 కోట్లు. పైరసీ భూతం పట్టి పీడిస్తున్న ఈరోజుల్లో హిట్ సినిమాకు ఈ మాత్రం వసూళ్లు వచ్చినా చాలు అనుకునే రోజులివి. అలాంటిది.. తలైవా పారితోషికం విని కళ్లు తిరిగి పడిపోతున్నారంట చిన్న నిర్మాతలు. ఈ సినిమా కోసం ముందుగా నిర్మాతలతో రజినీకి ఒక ఒప్పందం జరిగింది. అదేంటంటే..? సినిమాకు ముందు రజినీకి రూ.35 కోట్లు పారితోషికం ఇచ్చారు. సినిమా విడుదలైన తరువాత వచ్చే లాభాల్లో.. ఆయనకు వాటా ఇవ్వాలి. దాని ప్రకారం.. ఇప్పటిదాకా కబాలి సృష్టించిన వసూళ్ల సునామీ దృష్ట్యా రజినీకీ మరో రూ.45 కోట్లు ఇవ్వనున్నారట నిర్మాతలు. ఈ లెక్కన రజినీ పారితోషికం రూ.80 కోట్లు. ఒక సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు దేశంలోనే కాదు.. బహుశా ఆసియాలోనే ఇంకెవరూ లేరని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇంతకుముందు ఆసియాకు చెందిన హాలీవుడ్ నటుడు జాకీచాన్ తరువాత ఆ స్థాయిలో పారితోషికం తీసుకున్న నటుడిగా గుర్తింపు పొందాడు రజినీ. ఇప్పుడు ఆ విషయంలో జాకీచాన్‌ను కూడా దాటేశాడని అంటున్నారు అభిమానులు.
Next Story