ఆ ఇద్దరన్నదమ్ములు మళ్లీ కలిసి పోతారా?
మహారాష్ట్రలో ఆ ఇద్దరు వేరు వేరు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న అన్నదమ్ములు. ఒకరు శివసేన వ్యవస్థాపకులు బాల్‌ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే కాగా, మరో నాయకుడు బాల్‌ఠాక్రే అన్న కుమారుడు రాజ్‌ఠాక్రే. బాల్‌ఠాక్రే అనంతరం శివసేనకు ఎవరూ నాయకత్వం వహించాలనే విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య విబేధాలు పొడసూపాయి. ఈ కారణంగా ఆ ఇద్దరు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారారు. సహజంగానే బాల్‌ఠాక్రే తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే వైపే మొగ్గు చూపారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర […]
BY sarvi29 July 2016 8:07 AM GMT
X
sarvi Updated On: 30 July 2016 2:03 AM GMT
మహారాష్ట్రలో ఆ ఇద్దరు వేరు వేరు పార్టీలకు నాయకత్వం వహిస్తున్న అన్నదమ్ములు. ఒకరు శివసేన వ్యవస్థాపకులు బాల్‌ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే కాగా, మరో నాయకుడు బాల్‌ఠాక్రే అన్న కుమారుడు రాజ్‌ఠాక్రే. బాల్‌ఠాక్రే అనంతరం శివసేనకు ఎవరూ నాయకత్వం వహించాలనే విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య విబేధాలు పొడసూపాయి. ఈ కారణంగా ఆ ఇద్దరు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారారు. సహజంగానే బాల్‌ఠాక్రే తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే వైపే మొగ్గు చూపారు.
రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించిన రాజ్‌ఠాక్రేకి ఇది నచ్చలేదు. ఆయన 2006లో వేరుగా రాజకీయ కుంపటి పెట్టుకున్నారు. ఆ పార్టీ పేరే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ ఎస్). అప్పటి నుంచి రాజ్, ఉద్ధవ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. బాల్‌ఠాక్రే మరణాంతరం ఆ ఇద్దరు ఠాక్రేలను కలిపేందుకు అనేక మంది నాయకులు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. సాధారణ ఎన్నికల్లోనూ ఉభయ పార్టీల మధ్య ఏమాత్రం సయోధ్య కుదరలేదు. బీజేపీతో రాజ్‌ఠాక్రేకు మొదటి నుంచి సరైన సంబంధాలు లేవు. ఆ పార్టీ విధానాలను అడుగడుగునా వ్యతిరేకిస్తున్న రాజ్‌ఠాక్రే కమలనాథులకు దూరంగా ఉన్నారు.
ఉద్ధవ్ అలా కాకుండా తమ పార్టీ విధానం ప్రకారం బీజేపీతో జత కట్టారు. అయితే 25 సంవత్సరాలుగా బీజేపీతో కలిసి పోటీ చేసినా రాజకీయంగా తమకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆయన ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బీజేపీకి శివసేనకు మధ్య దూరం పెరుగుతున్నది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే రాజ్‌ఠాక్రే పది సంవత్సరాల తరువాత ఉద్ధవ్ ఠాక్రే నివసిస్తున్న మాతో శ్రీకి శుక్రవారం వెళ్లారు. ప్రస్తుత రాజకీయాలు చర్చించారు. రాబోయే ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలనే ఒక అవగాహనకు వచ్చినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ విషయంలో సయోధ్య కుదుర్చుకునేందుకే రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్‌ఠాక్రేతో సమావేశమైనట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Next Story