తెలుగు దేశం నేతలపై నిఘా ?
మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని టీడీపీ యోచిస్తున్నట్లుగా ఉంది. అందుకే వచ్చెనెల 7న జరిగే ప్రధాని సభలో ఆందోళనకు దిగుతామని ప్రకటించింది టీడీపీ. దీంతో తెలంగాణ పోలీసులు, నిఘా, ఇంటలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఆగస్టు 15న మోదీని హత్య చేసేందుకు తీవ్రవాదులు కుట్రలు పన్నారని కేంద్ర నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆయన పర్యటనలు, సభలపై భద్రతను పెంచారు. ఆగస్టు 15కు ముందు ఆయన పర్యటించే ప్రాంతాల్లో నిఘాను మరింత తీవ్ర తరం […]
BY sarvi29 July 2016 6:28 AM IST
X
sarvi Updated On: 29 July 2016 6:47 AM IST
మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని టీడీపీ యోచిస్తున్నట్లుగా ఉంది. అందుకే వచ్చెనెల 7న జరిగే ప్రధాని సభలో ఆందోళనకు దిగుతామని ప్రకటించింది టీడీపీ. దీంతో తెలంగాణ పోలీసులు, నిఘా, ఇంటలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఆగస్టు 15న మోదీని హత్య చేసేందుకు తీవ్రవాదులు కుట్రలు పన్నారని కేంద్ర నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆయన పర్యటనలు, సభలపై భద్రతను పెంచారు. ఆగస్టు 15కు ముందు ఆయన పర్యటించే ప్రాంతాల్లో నిఘాను మరింత తీవ్ర తరం చేశారు. ఈ నేపథ్యంంలోనే ఆగస్టు 7న ఆయన తెలంగాణలోని గజ్వేల్‌లో పర్యటించనున్నారు. ఎలాగైనా మోదీ సభలో ఆందోళన చేసి తీరుతామని గజ్వేల్ టీడీపీ నేత వంటేరు ప్రతాపరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అది ఆయన వ్యక్తిగతమా? బాబు వ్యూహమా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ, తెలంగాణలోని టీడీపీ నేతలు, ముఖ్యంగా గజ్వేల్ ప్రాంతంలో తెలుగుదేశం నాయకులపై పోలీసులు నిఘాను పెంచినట్లు సమాచారం.
ప్రధాని సభలో ఆందోళన చేస్తే.. అది తెలంగాణ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యంగానే చెప్తుంది జాతీయ మీడియా. అందుకే, సభలో వారికి ధర్నా చేసే అవకాశమివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇందుకోసం స్థానిక నేతల కదలికలపై నిఘా వేసినట్లు సమాచారం. ప్రధాని పర్యటన రోజున వారిని ముందస్తు అరెస్టు లేదా హౌస్ అరెస్టు చేసే అవకాశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఇంతవరకూ టీడీపీ నేతలతో ఎలాంటి సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం లేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ప్రధాని సభలో టీడీపీ గలాటా చేస్తే.. బీజేపీ స్పందన ఎలా ఉంటుంది?అన‌్న విషయమూ ఆసక్తికరంగానే ఉంది. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలను ఆరోజు ఇల్లు కదలనీయకుండా చర్యలు తీసుకునే పనిలో ఉన్నారని తెలిసింది.
Next Story