Telugu Global
NEWS

కిక్కులో కృష్ణా, గుంటూరు జిల్లాల రికార్డు

ఏపీ రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాలలో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగాయి. గత ఐదేళ్ల రికార్డులను పరిశీలిస్తే గడిచిన రెండేళ్లుగా ఈ రెండు జిల్లాల్లో లిక్కర్ వినియోగం భారీగా ఉంది. 2013-14 లో మద్యం వినియోగంలో కృష్ణాజిల్లాలో వృద్ధిరేటు కేవలం ఒకశాతం ఉండేది. 2014-15తో వృద్ధి రేటు 0.84గా నమోదైంది. అయితే 2015-16లో మాత్రం లిక్కర్ వినియోగంలో ఏకంగా 10.02 శాతం వృద్ధిరేటును కృష్ణా జిల్లా నమోదు చేసింది. గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. గుంటూరు జిల్లాలో 2014-15లో […]

కిక్కులో కృష్ణా, గుంటూరు జిల్లాల రికార్డు
X

ఏపీ రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాలలో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగాయి. గత ఐదేళ్ల రికార్డులను పరిశీలిస్తే గడిచిన రెండేళ్లుగా ఈ రెండు జిల్లాల్లో లిక్కర్ వినియోగం భారీగా ఉంది. 2013-14 లో మద్యం వినియోగంలో కృష్ణాజిల్లాలో వృద్ధిరేటు కేవలం ఒకశాతం ఉండేది. 2014-15తో వృద్ధి రేటు 0.84గా నమోదైంది. అయితే 2015-16లో మాత్రం లిక్కర్ వినియోగంలో ఏకంగా 10.02 శాతం వృద్ధిరేటును కృష్ణా జిల్లా నమోదు చేసింది.

గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. గుంటూరు జిల్లాలో 2014-15లో మద్యం విక్రయాల వృద్ధిరేటు 3.85గా ఉంది. 2015-16కు వచ్చే సరికి వృద్ధిరేటు 12. 35శాతానికి పెరిగింది. సాధారణంగా మద్యం విక్రయాలు ఎక్కువగా ఉండే జిల్లాలను కూడా రెండేళ్లలో గుంటూరు,కృష్ణా క్రాస్ చేసేశాయి. రాజధాని ప్రకటన తర్వాత ఈ రెండు జిల్లాల్లో డబ్బు చెలామణి ఎక్కువవడం కూడా మద్యం విక్రయాలు పెరిగేందుకు ప్రధానకారణమని భావిస్తున్నారు.

Click on Image to Read:

ke-krishnamurthy

pulla-rao

vijayasai-reddy

lokesh-comments

jaleel-khan

srichaitanya eamcet paper leak

First Published:  29 July 2016 3:47 AM IST
Next Story