Telugu Global
Cinema & Entertainment

ర‌జ‌నీకాంత్ ను ఇలా కూడా వాడేసుకుంటున్నారు..!

ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్ అన్నీ చాలా గ్లామరస్‌గా, అందంగా కనిపించే హీరోలతోనే చేస్తారు. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ ముఖ్య ఉద్దేశ్యమే నల్లగా ఉండే మీరు తెల్లగా, గ్లామరస్‌గా మారుతారని ప్రచారం చేయడం. కానీ నల్లగా ఉండే రజనీకాంత్‌తో ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది ? చూడ్డానికి చాలా కామెడీగా ఉంటుంది… నల్లగా ఉండే ఇతర హీరోలతో ఇది సాధ్యం కాకపోవచ్చేమో గానీ…. రజనీకాంత్‌తో అయితే ఇది సాధ్యమే అని భావించిందో ఏమో? […]

ర‌జ‌నీకాంత్ ను ఇలా కూడా వాడేసుకుంటున్నారు..!
X

ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్ అన్నీ చాలా గ్లామరస్‌గా, అందంగా కనిపించే హీరోలతోనే చేస్తారు. ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ ముఖ్య ఉద్దేశ్యమే నల్లగా ఉండే మీరు తెల్లగా, గ్లామరస్‌గా మారుతారని ప్రచారం చేయడం. కానీ నల్లగా ఉండే రజనీకాంత్‌తో ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది ? చూడ్డానికి చాలా కామెడీగా ఉంటుంది… నల్లగా ఉండే ఇతర హీరోలతో ఇది సాధ్యం కాకపోవచ్చేమో గానీ…. రజనీకాంత్‌తో అయితే ఇది సాధ్యమే అని భావించిందో ఏమో? సదరు కంపెనీ… రజనీ కాంత్ కబాలి సినిమాకు ఉన్న క్రేజ్‌ను తన పబ్లిసిటీకి వాడుకుంది. కబాలి పోస్టర్లతో ఇమామి ఫెయిర్ అండ్ హాండ్సమ్ యాడ్స్ రిలీజ్ చేసింది. మరి ఆ యాడ్ చూసి ఏమని అర్థం చేసుకోవాలి… ఆ క్రీమ్ రాసుకుంటే రజనీ లాంటి రంగు వస్తుందని భావించాలా… అంటూ పలువురు జోక్స్ పేలుస్తున్నారు. పబ్లిసిటీకి పరాకాష్ట ఇంతకంటే ఏముంటుందని విమర్శిస్తున్నారు.

చాలా సినిమాల్లో రజనీకాంత్ నలుపు రంగును పొగుడుతూ సాంగ్స్ ఉన్నాయి…. మరి ఇప్పుడు ఈ యాడ్స్ చూస్తేనేమో నలుపు కాదు తెలుపే ప్రధానం అన్నట్లుగా ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తన సినీ జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎలాంటి యాడ్స్ లో నటించలేదు. ఆయన నేరుగా యాడ్స్ చేయకపోయినా.. దర్శక నిర్మాతలు మాత్రం రజినీ క్రేజ్ ను బాగా వాడేసుకుంటున్నారు. రజనీతో యాడ్స్ చేయించ‌డానికి ఒప్పించలేక పోయిన కార్పరొట్ సంస్థలన్నీ కబాలి ముసుగులో రజనీని వాడేసుకున్నాయి. పబ్లిసిటీకి పరాకాష్ట అంటే ఇదేనేమో? పెయిర్ నెస్ క్రీమ్ యాడ్ ను రజనీ కబాలి పోస్టర్ తో 1/6లో డిజైన్ చేసిన ఇమామి ఫెయిర్ అండ్ హాండ్సమ్ క్రీమ్ యాడ్ ఇదే.

kabali-fairness

First Published:  29 July 2016 10:38 AM IST
Next Story