ఎంసెట్ లీకేజీ దేశవ్యాప్తంగా జరిగింది!
తెలంగాణ ఎంసెట్ -2 పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది. ఇక మంత్రులు, ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టించింది ఈ భారీ కుంభకోణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు మిగిలిన విద్యార్థులు పరీక్షను రద్దు చేయవద్దని ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ లీకేజీకి సంబంధించి పలు కొత్త విషయాలు సర్కారుకు ఊరటనివ్వనున్నాయి. […]
BY sarvi29 July 2016 3:38 AM IST
X
sarvi Updated On: 29 July 2016 5:42 AM IST
తెలంగాణ ఎంసెట్ -2 పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది. ఇక మంత్రులు, ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టించింది ఈ భారీ కుంభకోణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మరోవైపు మిగిలిన విద్యార్థులు పరీక్షను రద్దు చేయవద్దని ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ లీకేజీకి సంబంధించి పలు కొత్త విషయాలు సర్కారుకు ఊరటనివ్వనున్నాయి. తెలంగాణ కేంద్రంగా లీకేజీ జరగలేదని, ఈ తతంగమంతా ఢిల్లీ కేంద్రంగానే నడిచిందని సీఐడీ ప్రాథమిక దర్యాప్తులో తేలడం రాష్ట్ర ప్రభుత్వానికి కొండంత ఊరటనిచ్చింది. పైగా సూత్ర ధారి రాజగోపాల్ రెడ్డి గతంలోనూ ఇలాంటి కుంభకోణంలో అరెస్టయిన నేపథ్యం ఉన్నవాడే కావడం గమనార్హం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. మరి అలాంటప్పుడు ఇది కేవలం తెలంగాణకే పరిమితం ఎందుకు అవుతుంది? అన్న కోణంలో సీఐడీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సమాచారం తెలంగాణ ప్రభుత్వం నెత్తిన పాలుపోసింది. ఈ లీకేజీ ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా ఇతనికి నెట్ వర్క్ ఉందని. లీకేజీలో తెలంగాణ ప్రభుత్వంపై రెండుమూడు రోజులుగా వస్తున్న ఆరోపణలకు నేడు సమాధానం ఇవ్వనుంది తెలంగాణ సర్కారు. రాజగోపాల్ రెడ్డి లీకేజీకి సహకరించిన అదృశ్య వ్యక్తుల పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో ఆ వ్యక్తులు ఎవరు ? అన‌్నప్రశ్నలు ఇటు ప్రభుత్వంలో అటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ రోజు సాయంత్రానికి ఈ వ్యవహారం మొత్తం కొలిక్కి రానుంది.. ఈ కుంభకోణంలో 70 మంది కంటే ఎక్కువ విద్యార్థులకు పేపర్ లీకేజీ జరిగింది. అందుకని, పరీక్ష రద్దుకే ప్రభుత్వం మొగ్గు చూపనుందని విశ్వసనీయ సమాచారం.
Next Story