పార్టీ మారినా... పదవి ఊడింది!
అటవీ భూమిని ఆక్రమించాడు.. అడ్డుకున్న అధికారులను బెదిరించాడు.. పెద్దలు చెప్పినా పెడచెవిన పెట్టాడు.. అధికార పార్టీలోకి వెళితే.. తన అక్రమాలకు అండ దొరుకుతుందని భావించాడు.. అయినా.. ప్రభుత్వం అతని పదవిని ఊడబీకింది. వివరాలు.. వరంగల్ జిల్లాలోని గూడురు జెడ్పీటీసీ ఖాసీం ఉదంతం ఇది. గూడూరు పరిధిలో అటవీశాఖకు చెందిన 50 ఎకరాల భూమిని కబ్జా చేశాడు ఖాసీం. దీనిపై రెవెన్యూ అధికారులు పలుమార్లు అభ్యంతరం తెలిపారు. ఆక్రమించిన భూమిని వెంటనే అప్పగించాలని అటవీశాఖ అధికారులు ఖాసీంకు పలుమార్లు […]
BY sarvi28 July 2016 6:15 AM IST
X
sarvi Updated On: 28 July 2016 7:00 AM IST
అటవీ భూమిని ఆక్రమించాడు.. అడ్డుకున్న అధికారులను బెదిరించాడు.. పెద్దలు చెప్పినా పెడచెవిన పెట్టాడు.. అధికార పార్టీలోకి వెళితే.. తన అక్రమాలకు అండ దొరుకుతుందని భావించాడు.. అయినా.. ప్రభుత్వం అతని పదవిని ఊడబీకింది. వివరాలు.. వరంగల్ జిల్లాలోని గూడురు జెడ్పీటీసీ ఖాసీం ఉదంతం ఇది. గూడూరు పరిధిలో అటవీశాఖకు చెందిన 50 ఎకరాల భూమిని కబ్జా చేశాడు ఖాసీం. దీనిపై రెవెన్యూ అధికారులు పలుమార్లు అభ్యంతరం తెలిపారు. ఆక్రమించిన భూమిని వెంటనే అప్పగించాలని అటవీశాఖ అధికారులు ఖాసీంకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వీటిని లెక్క చేయలేదు. పైగా తాను ఆక్రమించుకున్న భూమిలోకి వచ్చిన అధికారులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
ఇదే సమయంలో ఖాసీం మరో దుష్ట ఆలోచన కూడా చేశాడు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్సీటీసీగా గెలిచాను కాబట్టి అధికారులు తన అక్రమాలను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని అనుకున్నాడు. అందుకే, వెంటనే అధికార పార్టీలోకి జంప్ అయ్యాడు. గులాబీ పార్టీ నేతలు వెనకాముందు ఆలోచించకుండా..అతన్ని పార్టీలోకి తీసుకున్నారు. తీరా అతని అక్రమాలపై మంత్రి జోగురామన్నకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అతనిపై చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టరును ఆదేశించారు. రంగంలోకి దిగిన కలెక్టరు విచారణ జరిపి పదవి నుంచి ఊడబీకారు. బరితెగించి.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే.. సొంతపార్టీ వారైనా ఎవరు మాత్రం ఎందుకు ఉపేక్షిస్తారు? అందుకే.. పీకిపడేశారు.
Next Story