Telugu Global
NEWS

ఎంసెట్ పేపర్ లీక్‌పై సీఐడీ ప్రకటనలో ఆసక్తికర అంశాలు

తెలంగాణ ఎంసెట్-2 లీకేజ్‌పై సీఐడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రెండు సెట్ల పత్రాలను నిందితులు లీక్ చేసినట్టు వెల్లడించింది. మొత్తం 320 ప్రశ్నలను విద్యార్థులకు చేరవేశారు. సమాధానాలు కూడా ఇచ్చి ప్రాక్టిస్ చేయించారు. మొత్తం ఐదు చోట్ల విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పరీక్షకు నాలుగు రోజుల ముందే ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చాయి. తాజాగా కేసులో విష్ణు, తిరుమలరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మార్గంలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ప్రింటింగ్‌ […]

ఎంసెట్ పేపర్ లీక్‌పై సీఐడీ ప్రకటనలో ఆసక్తికర అంశాలు
X

తెలంగాణ ఎంసెట్-2 లీకేజ్‌పై సీఐడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రెండు సెట్ల పత్రాలను నిందితులు లీక్ చేసినట్టు వెల్లడించింది. మొత్తం 320 ప్రశ్నలను విద్యార్థులకు చేరవేశారు. సమాధానాలు కూడా ఇచ్చి ప్రాక్టిస్ చేయించారు. మొత్తం ఐదు చోట్ల విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పరీక్షకు నాలుగు రోజుల ముందే ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చాయి. తాజాగా కేసులో విష్ణు, తిరుమలరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మార్గంలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ప్రింటింగ్‌ ప్రెస్ నుంచే పేపర్ లీక్ అయినట్టు సీఐడీ గుర్తించింది. అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని సీఐడీ చెప్పింది. మొత్తం స్కాం విలువ రూ. 15 కోట్లుగా నిర్ధారించారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షల నుంచి 40 లక్షలు వసూలు చేశారు బ్రోకర్లు.

సీఐడీ తన ప్రకటనలో మొత్తం ఐదు నగరాల్లో విద్యార్థులకు క్యాంపు ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. కానీ కేవలం బెంగుళూరు వెళ్లిన బ్యాచ్‌కు సంబంధించిన వివరాలను మాత్రమే ప్రకటనలో వివరించింది సీఐడీ. మిగిలిన నాలుగు నగరాల్లో క్యాంపుకు సంబంధించిన వివరాలను మాత్రం ప్రకటనలో వెల్లడించలేదు.

First Published:  28 July 2016 12:27 PM IST
Next Story