సీమ నేతలు సన్యాసులుగా మారాల్సిన సమయం వచ్చిందా?
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమను చంద్రబాబు దాదాపు వెలివేసినట్టుగానే ఉన్నారు. శ్రీశైలం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు లేక రాయలసీమప్రజలు అలమటిస్తుంటే చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే ఆ ప్రాంతంపై కక్ష సాధిస్తూనే ఉన్నారు. రాయలసీమకు శ్రీశైలంనుంచి నీరు అందాలంటే కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలి. కానీ చంద్రబాబు తాగునీటిపేరుతో, విద్యుత్ ఉత్పత్తిపేరుతో శ్రీశైలం డ్యాంలో నీటిమట్టాన్ని 790 అడుగుల వరకు తగ్గించారు. ఎగువ నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్న ప్రవాహంతో శ్రీశైలంనీటి మట్టం 805 అడుగులకు చేరింది. […]
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమను చంద్రబాబు దాదాపు వెలివేసినట్టుగానే ఉన్నారు. శ్రీశైలం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు లేక రాయలసీమప్రజలు అలమటిస్తుంటే చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే ఆ ప్రాంతంపై కక్ష సాధిస్తూనే ఉన్నారు. రాయలసీమకు శ్రీశైలంనుంచి నీరు అందాలంటే కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలి. కానీ చంద్రబాబు తాగునీటిపేరుతో, విద్యుత్ ఉత్పత్తిపేరుతో శ్రీశైలం డ్యాంలో నీటిమట్టాన్ని 790 అడుగుల వరకు తగ్గించారు. ఎగువ నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్న ప్రవాహంతో శ్రీశైలంనీటి మట్టం 805 అడుగులకు చేరింది. ఇంతలోనే చంద్రబాబు మరోసారి సీమ నోట్లో మట్టికొట్టారు. తనకు ఇష్టమైన ప్రాంతానికి నీరు తీసుకెళ్లేందుకు కేసీఆర్‌తో ఒప్పందం చేసుకున్నారు.
శ్రీశైలం నుంచి దిగువకు నీరిస్తేనే సాగర్ కుడికాలువకు నీరు వదిలేందుకు ఒప్పుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడమే ఆలస్యం చంద్రబాబు అందుకు అంగీకరించారు. ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 31. 69 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నప్పటికీ దానిలోనూ మరో 10 టీఎంసీలు దిగువకు వదిలేందుకు అంగీకరించారు. అదే జరిగితే శ్రీశైలం నీటి మట్టం తిరిగి భారీగా పడిపోతుంది. అప్పుడు తిరిగి శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు చేరేది ఎప్పుడు?. రాయలసీమకు నీరు అందేదెప్పుడు?. పైగా రాయలసీమ గడ్డమీదే మీటింగ్‌లు పెట్టి పట్టిసీమ పూర్తయింది… ఇక శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరిస్తానని అబద్దాలు చెప్పే చంద్రబాబు వాస్తవంగా మాత్రం శ్రీశైలం నుంచి చుక్క నీరు కూడా సీమ జిల్లాలకు అందకుండా చేస్తున్నారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే చంద్రబాబు రాయలసీమకు వ్యతిరేకి అన్న భావన ఇప్పటికే బలంగా ఉంది. కాబట్టి ఆయన రాయలసీమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ రాయలసీమ జనం ఓట్లు వేయించుకుని, రాయలసీమలో పండిన పంటను తింటూ కూడా నోరు మెదపని అధికార, ప్రతిపక్ష రాయలసీమ నేతలను ఏమనాలి?. రాయలసీమ గురించి మాట్లాడితే ఆంధ్ర ఓట్లు పడవేమోనన్న భయంతో అధికారం కోసం గోతికాడ నక్కల్లా కాపు కాచే నేతలున్నంత కాలం, కేసుల వల్ల పక్క రాష్ట్ర పెద్దల చేతుల్లో బంధీలైన నేతలున్నంత కాలం సీమ ప్రజలకు వెయ్యి అడుగుల లోతులోని నీరే దిక్కు.
Click on Image to Read: