నారాయణ కాలేజీలో మరో విద్యార్ధి ఆత్మహత్య
కాలేజిలో లెక్చరర్ వేధింపులను భరించలేక ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందు కాలేజి యాజమాన్యంపై గొడవకు దిగిన తల్లిదండ్రులు తరువాత కాలేజితో రాజీపడి అనారోగ్యంతో మరణించాడంటూ మాట మార్చారు. కర్నూలులోని బుధవార పేటకు చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు బొలగల్ల సందీప్ (16) నారాయణ కాలేజిలో ఎంపిసి ఐఐటి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజిలో ఓ లెక్చరర్ తనని హేళన చేస్తున్నాడని సందీప్ తల్లిదండ్రులకు చెప్పాడు. తాము వచ్చి కాలేజిలో మాట్లాడతామని తల్లిదండ్రులు అతనికి సర్దిచెప్పాడు. మంగళవారం […]
కాలేజిలో లెక్చరర్ వేధింపులను భరించలేక ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముందు కాలేజి యాజమాన్యంపై గొడవకు దిగిన తల్లిదండ్రులు తరువాత కాలేజితో రాజీపడి అనారోగ్యంతో మరణించాడంటూ మాట మార్చారు. కర్నూలులోని బుధవార పేటకు చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు బొలగల్ల సందీప్ (16) నారాయణ కాలేజిలో ఎంపిసి ఐఐటి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజిలో ఓ లెక్చరర్ తనని హేళన చేస్తున్నాడని సందీప్ తల్లిదండ్రులకు చెప్పాడు. తాము వచ్చి కాలేజిలో మాట్లాడతామని తల్లిదండ్రులు అతనికి సర్దిచెప్పాడు. మంగళవారం యధావిధిగా కాలేజికి వెళ్లిన సందీప్, ఇంటికి వచ్చాక రాత్రి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత బాదినా తీయకపోవటంతో చుట్టుపక్కలవారి సహాయంతో తలుపులను బద్దలు కొట్టారు.
లోపల సందీప్ ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. సందీప్ మరణానికి కాలేజిలో లెక్చరర్ ఎగతాళి మాటలే కారణమని తల్లిదండ్రులు బంధువులకు తెలపటంతో బుధవారం అంతా కలిసి కాలేజి వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. అయితే ఆ తరువాత సందీప్ కుటుంబానికి, కాలేజి యాజమాన్యానికి రాజీ కుదరటంతో తమ బిడ్డ అనారోగ్యంతో మరణించాడని వారు పోలీసులకు చెప్పారు.