కేసీఆర్ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ!
కేసీఆర్ సర్కారును రెండు వారాలుగా మల్లన్నసాగర్ ఆందోళన, ఎంసెట్ పేపర్ లీకేజీల రూపంలో వరుస ఆపదలు చుట్టుముడుతున్నాయి. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల ఆందోళనతో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఒకరకంగా ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రజల మద్దతు కూడగట్టగలిగాయి. ఈ వ్యవహారాన్ని ఎలాగైనా సద్దుమణిగేలా చేయాలని మంత్రి హరీశ్ రావు విదేశీ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ప్రతిపక్షాల అరెస్టు, రైతులపై లాఠీఛార్జి విషయంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు భూములు […]
BY sarvi28 July 2016 4:29 AM IST
X
sarvi Updated On: 28 July 2016 4:45 AM IST
కేసీఆర్ సర్కారును రెండు వారాలుగా మల్లన్నసాగర్ ఆందోళన, ఎంసెట్ పేపర్ లీకేజీల రూపంలో వరుస ఆపదలు చుట్టుముడుతున్నాయి. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల ఆందోళనతో ప్రతిపక్షాలు ఉమ్మడిగా పోరాడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఒకరకంగా ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రజల మద్దతు కూడగట్టగలిగాయి. ఈ వ్యవహారాన్ని ఎలాగైనా సద్దుమణిగేలా చేయాలని మంత్రి హరీశ్ రావు విదేశీ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ప్రతిపక్షాల అరెస్టు, రైతులపై లాఠీఛార్జి విషయంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు భూములు ఇచ్చేవారు ముందుకు వస్తున్నా.. మరోవైపు ఇష్టంలేనివారు తమ ఆందోళనలు కొనసాగించడం సర్కారుకు మింగుడుపడటం లేదు. భూనిర్వాసితుల పోరాటానికి క్రమంగా ప్రతిపక్షాల మద్దతు పెరుగుతుండటం ప్రభుత్వంలో ఆందోళనను పెంచుతోంది. వీరికితోడుగా స్వచ్ఛంద సంస్థలు, మేధావులు కూడా భూనిర్వాసితులకు మద్దతు పలుకుతుండటంతో ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
ఇది చాలదన్నట్లుగా తాజాగా ఎంసెట్ -2 పేపర్ లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి మరో మచ్చ తెచ్చి పెట్టింది. ఈ వ్యవహారంలో సూత్రధారులను సీఐడీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినప్పటికీ.. మరి కొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నారు. ఒకేసారి ఆరు బృందాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు కేవలం రెండురోజుల్లోనే కేసును ఓ కొలిక్కి తేగలిగారు. అయితే, నిందితులను పట్టుకోగానే వ్యవహారం ముగిసిపోలేదు. మరి, ఎంసెట్ -2 పరీక్షను రద్దు చేయాలా? వద్దా? అన్న విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతుంది. 72 మందికి పేపర్ లీక్ అయిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కేవలం వీరిపైనే చర్యలు తీసుకోవాలని మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాదు కాదు.. మొత్తం పరీక్ష రద్దు చేయాలని.. నిపుణులు, మేధావులు సూచిస్తున్నారు. వేలాది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసిన లీకేజీ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద మరకనే అంటించింది.
Next Story