ఏపీ ఎంసెట్ పేపర్ లీక్ అవలేదు- కామినేని
తెలంగాణ ఎంసెట్-2తో పాటు ఏపీ ఎంసెట్ పేపర్ కూడా లీక్ అయినట్టు వచ్చిన వార్తలను మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. ఏపీ ఎంసెట్ పేపర్ లీక్ అవలేదని స్పష్టం చేశారు. ఎంసెట్ నిర్వాహణలో ఎక్కడా తప్పు జరగలేదన్నారు. పోలీసులు, ఉన్నతాధికారులతో మాట్లాడినతర్వాతే ఈ విషయం చెబుతున్నానన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం తగదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ ఎంసెట్ పేపర్‌తో పాటు ఏపీ ఎంసెట్ పేపర్‌ను కూడా నిందితులు లీక్ చేశారని… ఈ విషయం […]
తెలంగాణ ఎంసెట్-2తో పాటు ఏపీ ఎంసెట్ పేపర్ కూడా లీక్ అయినట్టు వచ్చిన వార్తలను మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. ఏపీ ఎంసెట్ పేపర్ లీక్ అవలేదని స్పష్టం చేశారు. ఎంసెట్ నిర్వాహణలో ఎక్కడా తప్పు జరగలేదన్నారు. పోలీసులు, ఉన్నతాధికారులతో మాట్లాడినతర్వాతే ఈ విషయం చెబుతున్నానన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం తగదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ ఎంసెట్ పేపర్‌తో పాటు ఏపీ ఎంసెట్ పేపర్‌ను కూడా నిందితులు లీక్ చేశారని… ఈ విషయం టీ సీఐడీ విచారణలో తేలిందంటూ ఒక ప్రముఖ పత్రిక కథనాన్నిరాసింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ పెద్దలకు తెలంగాణ సీఐడీ చేరవేసిందని కూడా వెల్లడించింది. అందువల్లే ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఏపీలో మెడికల్ వెబ్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసిందని పత్రిక రాసింది. ఈ నేపథ్యంలో మంత్రి కామినేని స్పందించారు.