ఈ-టికెట్ స్కీము...ఒక్క రూపాయి ప్రీమియంతో రైలు ప్రమాద బాధితులకు లక్షల్లో పరిహారం!
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) వెబ్సైట్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకునే రైలు ప్రయాణీకులకు భారత రైల్వే ఒక మంచి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించనుంది. ఇలా టికెట్లు బుక్ చేసుకున్న వారికి కేవలం ఒక్క రూపాయి ప్రీమియంతో 10లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కీము ప్రకారం, ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యులు పొందే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి…ప్రయాణంలో ప్రమాదవశాత్తూ మరణంగానీ, పూర్తి స్థాయి అంగవైకల్యం గాని సంభవిస్తే […]
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) వెబ్సైట్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకునే రైలు ప్రయాణీకులకు భారత రైల్వే ఒక మంచి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించనుంది. ఇలా టికెట్లు బుక్ చేసుకున్న వారికి కేవలం ఒక్క రూపాయి ప్రీమియంతో 10లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్కీము ప్రకారం, ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యులు పొందే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి…ప్రయాణంలో ప్రమాదవశాత్తూ మరణంగానీ, పూర్తి స్థాయి అంగవైకల్యం గాని సంభవిస్తే 10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తారు. పాక్షిక అంగవైకల్యానికి 7.5లక్షలు చెల్లిస్తారు. 2 లక్షల వరకు ఆసుపత్రి ఖర్చులు చెల్లిస్తారు. 10వేల రూపాయలు.. మృతదేహం, లేదా క్షతగాత్రుల తరలింపుకి ఇస్తారు. రైలు ప్రమాదంతో పాటు ప్రయాణంలో టెర్రరిస్టుల దాడులు, దొంగతనాలు, దోపిడీల్లాంటి ప్రమాదాలకు గురయినవారికి సైతం ఇవి వర్తిస్తాయి.
వెబ్సైట్ నుండి ఈ–టికెట్ ద్వారా తమ టికెట్ని బుక్ చేసుకున్న వారందరికీ ఈ స్కీము వర్తిస్తుంది. నగరాలనుండి ప్రయాణించే సబర్బన్ రైలు ప్రయాణీకులకు సైతం ఈ సదుపాయాలు ఉన్నాయి. ఈ పథకాన్ని ఐఆర్సిటిసి… ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీల భాగస్వామ్యంతో అమల్లోకి తేనుంది. 19 కంపెనీలు ఈ స్కీములో పాలుపంచుకునేందుకు పోటీపడగా ఈ మూడు కంపెనీలు ఎంపికయ్యాయి.