అయిన వారి కోసం సొంత చట్టాన్నే ఉల్లంఘించిన చంద్రబాబు
సీఆర్‌డీఏ చట్టం. ఇది చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాసుకున్నదే. రాజధాని అమరావతి నిర్మాణం కోసం తానే చైర్మన్‌గా చంద్రబాబు సీఆర్‌డీఏను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఆ చట్టంలో చేసుకున్న బాసలకు చంద్రబాబు నీళ్లొదిలేశారు. కావాల్సిన వ్యక్తిని సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించుకునేందుకు గాను నిబంధనలను ఉల్లంఘించారు. చట్టం ప్రకారం గతంలో ఏదో ఒక జిల్లాకు కలెక్టర్‌గా చేసిన వ్యక్తే సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉండేందుకు అర్హులు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 21(1) ఇదే విషయాన్ని చెబుతోంది. కానీ చంద్రబాబు తన […]
సీఆర్‌డీఏ చట్టం. ఇది చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాసుకున్నదే. రాజధాని అమరావతి నిర్మాణం కోసం తానే చైర్మన్‌గా చంద్రబాబు సీఆర్‌డీఏను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంతలోనే ఆ చట్టంలో చేసుకున్న బాసలకు చంద్రబాబు నీళ్లొదిలేశారు. కావాల్సిన వ్యక్తిని సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించుకునేందుకు గాను నిబంధనలను ఉల్లంఘించారు. చట్టం ప్రకారం గతంలో ఏదో ఒక జిల్లాకు కలెక్టర్‌గా చేసిన వ్యక్తే సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉండేందుకు అర్హులు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 21(1) ఇదే విషయాన్ని చెబుతోంది. కానీ చంద్రబాబు తన వర్గం వాడైన చెరుకూరి శ్రీధర్‌కు కమిషనర్ పదవి కట్టబెట్టేందుకు ఆ నిబంధనలను తొక్కేశారు. చెరుకూరి శ్రీధర్ ఇప్పటి వరకూ ఎక్కడా కలెక్టర్‌గా చేయలేదు. ప్రస్తుతం ఆయన గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా ఉన్నారు. ఆయన సర్వీస్‌లోకి వచ్చింది కూడా 2009లోనే. ఇంతటి జూనియర్ అధికారి అయిన చెరుకూరికి ఏకంగా చంద్రబాబు కమిషనర్ పదవి కట్టబెట్టడంపై మిగిలిన వర్గాల అధికారులు రగిలిపోతున్నారు.
అంతేకాదు ఇప్పటి వరకు కమిషనర్‌గా వ్యవహరించిన నాగులాపల్లి శ్రీకాంత్‌ను ఆ పదవి నుంచి తొలగించిన తీరుపైనా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నేరుగా సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో రహస్య చర్చలు జరిపి రూపొందించుకున్న స్విస్ చాలెంజ్ నియమ నిబంధనలపై శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్విస్ చాలెంజ్ విధానాలన్నీ చట్టవిరుద్దంగా ఉన్నాయంటూ ఆయన తొలుత ప్రశ్నించారు. దాంతో స్విస్ చాలెంజ్‌కు ఆమోద ముద్ర వేయించుకునేందుకు చంద్రబాబు .. నేరుగా తానే ఫైల్‌పై సంతకం పెట్టి ఆ తర్వాత ఫైల్‌ను సీఎస్ దగ్గరకు పంపి దిగ్బ్రాంతి కలిగించారు. ఈనేపథ్యంలో తనకు ఇష్టమైన వ్యక్తిని కమిషనర్‌గా నియమించుకునేందుకు చంద్రబాబు పావులు కదిపారని చెబుతున్నారు. మరో విశేషం ఏమిటంటే… రైతుల నుంచి భూములు లాక్కునే వ్యవహారాన్ని శ్రీకాంత్ ద్వారా చేయించిన చంద్రబాబు… ఇప్పుడు తీరా భూములు పంచుకునే సమయానికి ఆయన్ను పక్కనపెట్టి చెరుకూరిని తీసుకురావడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Click on Image to Read: