మోడీ నన్ను హత్య చేయిస్తారేమో: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
కొంతకాలంగా కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం తారాస్థాయికి చేరింది. కేజ్రీవాల్ అలా వ్యాఖ్యనించడానికి బలమైన కారణాలున్నాయి. ఎందుకంటే ఇటీవల ఆప్ ను అణచి వేసేందుకు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నాయకులను చిన్న చితకా కేసుల్లో కూడా అరెస్టు చేయించి జైలుకు పంపిస్తున్నది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో […]
కొంతకాలంగా కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం తారాస్థాయికి చేరింది. కేజ్రీవాల్ అలా వ్యాఖ్యనించడానికి బలమైన కారణాలున్నాయి. ఎందుకంటే ఇటీవల ఆప్ ను అణచి వేసేందుకు మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే ఆ పార్టీ నాయకులను చిన్న చితకా కేసుల్లో కూడా అరెస్టు చేయించి జైలుకు పంపిస్తున్నది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో ప్రధాని మోడీ నన్ను హత్య చేయిస్తారేమోనంటూ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలను ఉద్దేశించి దాదాపు పది నిమిషాలు ఆయన మాట్లాడారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు, ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఇదే ప్రథమమని పరిశీలకులు అంటున్నారు. ఆప్‌పై మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్లేలు అరెస్టు కావడం, బలమైన సాక్ష్యాదారాలు లేని కేసుల్లో కూడా జైలుకు పంపించడాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఆప్‌పై మోడీ కొనసాగిస్తున్న నిర్బంధ చర్యలపై ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు, కొంత సంచలనానికి కారణమైనప్పటికీ, అందులో ఆయన ఆరోపణల్లో వాస్తవాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆప్ నేతగా తన పార్టీని రక్షించుకునేందుకు కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయక తప్పలేదని కూడా మరి కొందరు అంటున్నారు.