చేతబడి భయంతో భార్య ఆత్మహత్య...ఆ బాధతో భర్త కూడా...ఆపై కూతురు!
గ్రామంలో కొంతమంది మంత్రతంత్రాలకు పాల్పడేవారి బెదిరింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడితే ఆ బాధని తట్టుకోలేక ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులను కోల్పోయిన 11ఏళ్ల వారి చిన్నారి సైతం ఆత్మహత్యకు ప్రయత్నించి బతికి బయటపడింది. కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాకర్లలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం శ్యామల(31) అనే మహిళ ఈ నెల 21న ఆత్మహత్య చేసుకుంది. శ్యామలను కొంతమంది… డబ్బు ఇవ్వకపోతే చేతబడి చేస్తామని బెదిరించినట్టుగా తెలుస్తోంది. […]
గ్రామంలో కొంతమంది మంత్రతంత్రాలకు పాల్పడేవారి బెదిరింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడితే ఆ బాధని తట్టుకోలేక ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులను కోల్పోయిన 11ఏళ్ల వారి చిన్నారి సైతం ఆత్మహత్యకు ప్రయత్నించి బతికి బయటపడింది. కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాకర్లలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం శ్యామల(31) అనే మహిళ ఈ నెల 21న ఆత్మహత్య చేసుకుంది. శ్యామలను కొంతమంది… డబ్బు ఇవ్వకపోతే చేతబడి చేస్తామని బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఆ వేధింపులను తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో శ్యామల భర్త.. దేశపు ఏడుకొండలు (38) డిప్రెషన్కి గురయ్యాడు. అతను వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తున్నారు.
అతను తన కుమార్తె రమ్య (11)తో తన కారణంగానే అమ్మ చనిపోయిందని చెబుతుండేవాడు. తాను కూడా పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అనేవాడు. చెప్పినట్టుగానే అతను పురుగుల మందు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులను ఒకేసారి కోల్పోవటంతో తట్టుకోలేకపోయిన చిన్నారి సైతం తనకు అందుబాటులో ఉన్న పురుగుల మందు తాగేసింది. బంధువులు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలించారు. మొదట తిరువూరు ఆసుపత్రికి తరువాత విజయవాడ ఆసుపత్రికి తరలించగా రమ్య కోలుకుంటోంది. రమ్యకు తొమ్మిదేళ్ల తమ్ముడు ఉన్నాడు. ముచ్చటగా ఉన్న కుటుంబం ఒక్కసారిగా ముక్కలై పోవటంతో గ్రామంలో దిగులు వాతావరణం అలుముకుంది.