అమ్మను...ఆమె ప్రేమించిన వ్యక్తితో కలిపారు!
తల్లికి పెళ్లిచేయాలని తపించిన కూతురి కథను అప్పుడెప్పుడో స్వాతి సినిమాలో చూశాం. అదే కథ ఇప్పుడు మన కళ్లముందుకు వచ్చింది. తల్లి తన టీనేజిలో ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోలేకపోయిందని తెలుసుకున్న కుమార్తెలు ఆమె ప్రేమకథను సుఖాంతం చేశారు. కేరళలోని కొల్లాంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అనితా చెంబువిలయిల్(52), 32 ఏళ్ల క్రితం 1984లో పదవతరగతి చదువుతుండగా తన ట్యూషన్ టీచర్ విక్రమన్ ప్రేమలో పడింది. అయితే అనిత తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవటంతో ఆమె మరో వ్యక్తిని […]
తల్లికి పెళ్లిచేయాలని తపించిన కూతురి కథను అప్పుడెప్పుడో స్వాతి సినిమాలో చూశాం. అదే కథ ఇప్పుడు మన కళ్లముందుకు వచ్చింది. తల్లి తన టీనేజిలో ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోలేకపోయిందని తెలుసుకున్న కుమార్తెలు ఆమె ప్రేమకథను సుఖాంతం చేశారు. కేరళలోని కొల్లాంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అనితా చెంబువిలయిల్(52), 32 ఏళ్ల క్రితం 1984లో పదవతరగతి చదువుతుండగా తన ట్యూషన్ టీచర్ విక్రమన్ ప్రేమలో పడింది. అయితే అనిత తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవటంతో ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు కలిగారు. అయితే ఆ తరువాత ఏవో కారణాలతో ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటినుండి అనిత కష్టపడి కూతుళ్లను పెద్దచేసి, మంచి చదువులు చదివించారు.
విక్రమన్ కూడా అనితకు దూరంగా వెళ్లిపోయి ముప్పయ్యేళ్లు రాజకీయ కార్యకర్తగా జీవితం గడిపేశారు. విడిపోయిన తరువాత వారెప్పుడూ కలుసుకున్నది లేదు. అయితే ఈ క్రమంలో ఓ సారి అనిత కుమార్తె అథిరా దాథన్కు తన తల్లి ప్రేమ విషయం తెలిసింది. కుమార్తెలిద్దరూ ఆమెని విక్రమన్తో కలపాలని అనుకున్నారు. కానీ అనిత వారి పెళ్లిళ్ల తరువాత చూద్దాం… అంటూ దాటవేశారు. కుమార్తెలిద్దరూ తమ పెళ్లిళ్ల తరువాత… వారు అనుకున్న పని చేశారు. ఈ నెల 21న విక్రమన్తో అనిత వివాహం జరిపించారు. అలా కూతుళ్లిద్దరూ కలిసి తల్లి తొలిప్రేమ కథకు శుభం కార్డు వేశారు.