Telugu Global
National

రేపిస్టును వదిలేసి... ఈమెను అరెస్ట్ చేస్తారా ?

ఇప్పటివరకు 11మంది “ఆప్‌” ఎమ్మెల్యేలను అరెస్టుచేసి జైలుకు పంపించారు. వీళ్లతోపాటు జైలుకు వెళ్లిన అధికారులు అదనం. పార్లమెంట్‌లో కానీ, రాష్ట్రాల అసెంబ్లీలలో కానీ ఘోరమైన నేరాలుచేసిన ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో ఉన్నారు. హత్యా నేరాల్లో ఉన్నవారు, రేప్‌లు, కిడ్నాపులు మొదలైన నేర అభియోగాలతో ఉన్నవాళ్లు వందల్లో ఉన్నారు. కొంతమంది కోర్టు గడప ఎక్కితే మరికొంతమంది పోలీసుస్టేషన్‌ గడప కూడా ఎక్కకుండా నేరుగా పార్లమెంటు, అసెంబ్లీ గడప ఎక్కినవాళ్లే ఎక్కువమంది. సాధారణంగా మన ప్రజాప్రతినిధులు పక్కా ఆధారాలతో నేరస్తుడిగా […]

రేపిస్టును వదిలేసి... ఈమెను అరెస్ట్ చేస్తారా ?
X

ఇప్పటివరకు 11మంది “ఆప్‌” ఎమ్మెల్యేలను అరెస్టుచేసి జైలుకు పంపించారు. వీళ్లతోపాటు జైలుకు వెళ్లిన అధికారులు అదనం. పార్లమెంట్‌లో కానీ, రాష్ట్రాల అసెంబ్లీలలో కానీ ఘోరమైన నేరాలుచేసిన ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో ఉన్నారు. హత్యా నేరాల్లో ఉన్నవారు, రేప్‌లు, కిడ్నాపులు మొదలైన నేర అభియోగాలతో ఉన్నవాళ్లు వందల్లో ఉన్నారు. కొంతమంది కోర్టు గడప ఎక్కితే మరికొంతమంది పోలీసుస్టేషన్‌ గడప కూడా ఎక్కకుండా నేరుగా పార్లమెంటు, అసెంబ్లీ గడప ఎక్కినవాళ్లే ఎక్కువమంది.

సాధారణంగా మన ప్రజాప్రతినిధులు పక్కా ఆధారాలతో నేరస్తుడిగా దొరికిపోయినా అరెస్టు అయిన సందర్భాలు అతితక్కువ. కానీ ఒక్క ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుల విషయంలోనే ఈ లెక్క తిరగబడింది. జనం ఆశ్చర్యపోయి ముక్కుమీద వేలు వేసుకునేలాగా “ఆప్‌” విషయంలో చట్టం తనపని తాను చేసుకు పోతోంది.

ఈ ట్రెండ్‌ని గమనించి అరవింద్‌ కేజ్రీవాల్‌ “ఆప్‌” ఎమ్మెల్యేలంతా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచన చేశారు. ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలి చూస్తుంటే “ఆప్‌” ఎమ్మెల్యేలంతా జైలుకుపోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

గత మూడు, నాలుగురోజుల్లోనే ఇద్దరు”ఆప్‌” ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు.

వాళ్లలో ఒకరు అమానతుల్లా ఖాన్‌. ఆయన ఢిల్లీ “ఆప్‌” ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌. ఆయన ఇంటికి జులై 19న ఢిల్లీకి చెందిన ఒక మహిళ వెళ్లి మా ఇంటికి కరెంటు కోతలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి తిరిగి వస్తుంటే ఒక యువకుడు ఇలాంటి విషయాలను రాజకీయం చేస్తే ఆమెను చంపేస్తానని బెదిరించాడని అక్కడనుంచి ఆమె ఇంటికి వస్తుంటే ఆ యువకుడు తనపై వాహనాన్ని ఎక్కించి చంపేందుకు ప్రయత్నించాడని ఆ వాహనంలో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ కూడా ఉన్నాడని ఆమె కేసుపెట్టింది. పోలీసులు ఆగమేఘాలమీద ఎమ్మెల్యే మీద కేసుపెట్టారు. అరెస్టు చేసి జైలుకు పంపించారు.

మరొక కేసులో పంజాబ్‌లోని “ఆప్‌” ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకు చేశారంటే ఒక వ్యక్తి ఒక వర్గంవారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడట..! అతన్ని అరెస్టు చేస్తే తాను ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ ప్రోత్భలంతోనే ఆ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశానని అన్నాడట..! ఆ మాట ఆధారంగా “ఆప్‌” ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఇద్దరి ఎమ్మెల్యేలను ఎంత పెద్ద నేరాల మీద అరెస్టు చేసింది చూశాక మిగిలిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు ఎలాంటి నేరాల్లో అరెస్టు అయి ఉంటారో మనం అర్థంచేసుకోవచ్చు.

ఇప్పుడు మరో మహిళ.. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమెను ఆ పదవిలో నియమించింది “ఆప్‌” ప్రభుత్వం. ఆమె చేసిన నేరం ఏమిటంటే ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేయడం.

విషయం ఏమిటంటే… గత సంవత్సరం డిసెంబర్‌ 2న శివశంకర్‌ అనే వ్యక్తి కొంతమందితో కలిసి 14 సంవత్సరాల ఒక దళిత బాలికను రేప్‌చేశాడు.

ఈ కేసు ఈ ఏడాది మే 19న కోర్టులో విచారణకు వచ్చింది. విచారణకు కొద్దిముందు ఇదే శివశంకర్‌ అదే బాలికను మళ్లీ కిడ్నాప్‌ చేసి ఇంట్లో బందించి, కాళ్లు చేతులు కట్టేసి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో కూల్‌డ్రింక్‌లలో విషపదార్ధాలు కలిపి బలవంతంగా తాగించాడు. ఆ అమ్మాయి చనిపోయింది.

ఈ అమ్మాయి విషయంలో ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ పోలీసుల చేతగాని తనాన్ని ప్రశ్నిస్తూ నోటీస్‌ పంపారు. నిందితుడు శివకుమార్‌ను ఎందుకు అరెస్టుచేయలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో మరి ఎంతమంది నిర్భయలు చనిపోవాలని నిలదీశారు. ఆ నోటీసులో రేప్‌కు గురైన అమ్మాయిపేరు కూడా ఆమె ప్రస్తావిస్తూ ఆమెకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించింది.

దీనికి పోలీసులు స్పందించారు. చట్టం ప్రకారం రేప్‌ బాధితుల పేరు ప్రస్తావించకూడదు. ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ తన నోటీసులో ఆ అమ్మాయిపేరు ప్రస్తావించింది కాబట్టి ఆమె పైనే కేసు నమోదుచేశారు. బహుశా ఆమె అరెస్టూ తప్పదేమో…. ఢిల్లీ పోలీసులా? మజాకా..?

First Published:  27 July 2016 11:03 AM IST
Next Story