బాబు, రామోజీకి గ్యాస్ సిరులు ఎలా కురిశాయంటే?
తాజాగా ఆంధ్రప్రదేశ్ కేజీ బేసిన్లో 33 లక్ష కోట్ల రూపాయల విలువైన గ్యాస్ నిక్షేపాలు బయటపడిన వేళ తదుపరి ఏం జరుగుతుందన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే గతంలో చంద్రబాబు చేసిన పనిని తలుచుకుని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 2002లో చంద్రబాబు సీఎంగా ఉన్నసమయంలోనే కేజీ బేసిన్‌లో భారీగా గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఓఎన్‌జీసీ వాళ్లు దాన్నిగుర్తించగా అందుకు సంబంధించిన ఫైల్‌ను కొందరు పెద్దలు రిలయన్స్‌కు చేరవేశారని చెబుతుంటారు. అప్పట్లో ప్రభుత్వం పెద్దలు కుమ్మక్కు అయి […]
తాజాగా ఆంధ్రప్రదేశ్ కేజీ బేసిన్లో 33 లక్ష కోట్ల రూపాయల విలువైన గ్యాస్ నిక్షేపాలు బయటపడిన వేళ తదుపరి ఏం జరుగుతుందన్న దానిపై చర్చ జరుగుతోంది. అయితే గతంలో చంద్రబాబు చేసిన పనిని తలుచుకుని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 2002లో చంద్రబాబు సీఎంగా ఉన్నసమయంలోనే కేజీ బేసిన్‌లో భారీగా గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఓఎన్‌జీసీ వాళ్లు దాన్నిగుర్తించగా అందుకు సంబంధించిన ఫైల్‌ను కొందరు పెద్దలు రిలయన్స్‌కు చేరవేశారని చెబుతుంటారు. అప్పట్లో ప్రభుత్వం పెద్దలు కుమ్మక్కు అయి ఓఎన్‌జీసీ ఫైల్‌ను తొక్కిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఓఎన్‌జీసీ సర్వేచేసిన ప్రాంతానికి పక్కనే రిలయన్స్ వాళ్లు గ్యాస్ నిక్షేపాలను గుర్తించినట్టు ప్రకటించారు. ఇదంతా ఒక పద్దతి ప్రకారమే జరిగింది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టాలని చాలా మంది సూచించారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. రిలయన్స్‌కు లక్షల కోట్ల గ్యాస్‌నుదోచిపెట్టేందుకు చంద్రబాబు సైలెంట్ అయిపోయారని జగమెరిగిన ఆరోపణ. రిలయన్స్‌కు గ్యాస్‌పై ఒక ప్రముఖ పత్రిక మొదట్లో భారీ కథనం వేసింది. కానీ వెంటనే మౌనంగా ఉండిపోయింది. ఇది కూడా బాబు డైరెక్షన్‌లోనే జరిగిందని అందరూ చెబుతుంటారు. ఇక్కడ ఈనాడు, రిలయన్స్‌కు మధ్య లింక్ కూడా బయటపడింది. రామోజీ సంస్థలు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన సమయంలో ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ లోకి వేల కోట్లు వచ్చి పడ్డాయి. వంద రూపాయల విలువైన ఒక్కో షేరును 5, 28,630 రూపాయలు పెట్టి నిమేష్ కంపానీ సంస్థ కొనుగోలు చేసింది. ఇలా చేసి దాదాపు రెండు వేల కోట్లను ఈనాడు సంస్థలోకి పంపుచేశారు. ఈ నిమేష్ కంపానీ అన్నది రిలయన్స్ అనుబంధసంస్థ.
రిలయన్స్ ఇలా ఉదారంగా వేల కోట్లు కుమ్మరించడానికి కారణం… కేజీ బేసిన్‌లోని లక్షల కోట్ల విలువైన గ్యాస్‌ను కొల్లగొట్టడంలో చంద్రబాబు, ఈనాడు చేసిన సాయమేనని చెబుతుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిలయన్స్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్లు మన గ్యాస్‌ను తరలిస్తూనే ఉన్నాయి. కేజీ బేసిన్‌లో ఇంత గ్యాస్ ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో 3600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు గ్యాస్ లేక మూలనపడ్డాయి. ఇదంతా 2002లో చంద్రబాబు చేసిన ఘనకార్యం వల్లే జరిగింది. ఇప్పుడు 33లక్షల కోట్ల విలువైన గ్యాస్ నిక్షేపాలు బయటపడిన వేళ చంద్రబాబు మన గ్యాస్ మనకే అన్న కొత్త నినాదం తీసుకుని అనుకూల పత్రికల్లో కథనాలు రాయించుకున్నారు. దీని వెనుక ఏం ఉద్దేశం ఉందో?.
Click on Image to Read: