స్వయంగా తన ఆరోగ్యంపై ప్రకటన చేసిన రజనీకాంత్
దాదాపు 2 నెలలు అమెరికాలోనే ఉండిపోయారు రజనీకాంత్. ఆ టైమ్ లో రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో పుకార్లు. మరెన్నో ఊహాగానాలు, లెక్కలేనన్ని కథనాలు. కబాలి సినిమా విడుదలైన తర్వాత మాత్రమే చెన్నై వచ్చిన రజనీకాంత్ ఈమధ్య కాలంలో తన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన ఊహాగానాలకు చెక్ చెప్పారు. స్వయంగా తన చేత్తో ప్రేక్షక లోకానికి రాసిన ఉత్తరంలో రజనీకాంత్ తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు స్పష్టంచేశాడు. తన ఆరోగ్యానికి సంబంధించి లేఖలో రజనీకాంత్ ఇలా స్పందించారు…. […]
BY admin27 July 2016 10:26 AM IST
X
admin Updated On: 27 July 2016 4:33 PM IST
దాదాపు 2 నెలలు అమెరికాలోనే ఉండిపోయారు రజనీకాంత్. ఆ టైమ్ లో రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్నో పుకార్లు. మరెన్నో ఊహాగానాలు, లెక్కలేనన్ని కథనాలు. కబాలి సినిమా విడుదలైన తర్వాత మాత్రమే చెన్నై వచ్చిన రజనీకాంత్ ఈమధ్య కాలంలో తన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన ఊహాగానాలకు చెక్ చెప్పారు. స్వయంగా తన చేత్తో ప్రేక్షక లోకానికి రాసిన ఉత్తరంలో రజనీకాంత్ తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు స్పష్టంచేశాడు.
తన ఆరోగ్యానికి సంబంధించి లేఖలో రజనీకాంత్ ఇలా స్పందించారు…. “రోబో 2.0, కబాలి సినిమాలతో బాగా అలసిపోయాను. అందుకే మానసికంగా, శారీరకంగా పునరుత్తేజం పొందేందుకు 2 నెలలుగా అమెరికాలోనే రెస్ట్ తీసుకున్నాను. ఆ సమయంలో వైద్యుల పర్యవేక్షణలో కొన్ని పరీక్షలు కూడా చేయించుకున్నాను. నాతో పాటు నా కుమార్తె ఐశ్వర్య ధనుష్ కూడా ఉంది. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను.”
తన హెల్త్ రిపోర్ట్ అందిస్తూనే… కబాలి సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు రజనీకాంత్. తన నిర్మాత ధానుతో పాటు… దర్శకుడు రంజిత్ ను అభినందనల్లో ముంచెత్తారు.
Next Story