గంగ్నమ్@ రెండు వందల కోట్లు
గంగ్నమ్ డ్యాన్స్. టీవీ చూసే ప్రతి ఒక్కరూ ఈ డ్యాన్స్ గురించి చాలాసార్లు వినే ఉంటారు. గుర్రం లేకుండానే గుర్రపుస్వారీ చేస్తున్నట్టుగా అనిపించే ఈ పాప్ సాంగ్ ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ షేక్ చేస్తూనే ఉంది. గంగ్నమ్ దెబ్బకు య్యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. నాలుగేళ్ల వ్యవధిలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది ఈ సాంగ్. 2012 జులై 15న ఈ వీడియో యూట్యూబ్‌లో అప్ లోడ్ అవగా ఇప్పటి వరకు 260 కోట్ల మంది వీక్షించారు. అప్‌లోడ్ […]
గంగ్నమ్ డ్యాన్స్. టీవీ చూసే ప్రతి ఒక్కరూ ఈ డ్యాన్స్ గురించి చాలాసార్లు వినే ఉంటారు. గుర్రం లేకుండానే గుర్రపుస్వారీ చేస్తున్నట్టుగా అనిపించే ఈ పాప్ సాంగ్ ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ షేక్ చేస్తూనే ఉంది. గంగ్నమ్ దెబ్బకు య్యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలైపోయాయి. నాలుగేళ్ల వ్యవధిలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది ఈ సాంగ్. 2012 జులై 15న ఈ వీడియో యూట్యూబ్‌లో అప్ లోడ్ అవగా ఇప్పటి వరకు 260 కోట్ల మంది వీక్షించారు. అప్‌లోడ్ చేసిన 160 రోజుల్లోనే వంద కోట్ల మంది వీక్షకులను సంపాదించిన ఘనత కూడా గంగ్నమ్‌దే. ఈ పాప్ వీడియోను దక్షిణ కొరియా సింగర్ ”సై” రూపొందించారు. చో సూ హ్యూ డైరెక్షన్ చేశారు. దక్షిణకొరియాలోని గంగ్నమ్ అనే జిల్లాలోని ప్రజల జీవనశైలిని అద్దం పట్టేలా కొరియన్ ప్రాంతీయ యాసలో ఈ సాంగ్‌ను చిత్రీకరించారు.