టీ-ఎంసెట్ పేపర్ లీక్ ఢిల్లీలోనే..48గంటల ముందే
తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు సీఐడీ నిర్ధారించింది. ఇందుకు సంబంధించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. ఢిల్లీలోని ప్రిటింగ్ ప్రెస్‌లోనే పేపర్ లీక్ అయినట్టు గుర్తించారు. 30 మంది విద్యార్థులు పేపర్ లీక్ ద్వారా లబ్దిపొందారు. పరీక్షకు 48గంటల ముందు ముంబాయి, బెంగళూరులో విద్యార్థులకు లీక్ అయిన పేపర్లు అందజేశారు. సమాధానాలపై అక్కడే శిక్షణ ఇచ్చారు. ఎంసెట్-2 స్కాం విలువ రూ. 15కోట్లుగా సీఐడీ భావిస్తోంది. అడ్వాన్స్ […]

తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు సీఐడీ నిర్ధారించింది. ఇందుకు సంబంధించి సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. ఢిల్లీలోని ప్రిటింగ్ ప్రెస్‌లోనే పేపర్ లీక్ అయినట్టు గుర్తించారు. 30 మంది విద్యార్థులు పేపర్ లీక్ ద్వారా లబ్దిపొందారు. పరీక్షకు 48గంటల ముందు ముంబాయి, బెంగళూరులో విద్యార్థులకు లీక్ అయిన పేపర్లు అందజేశారు. సమాధానాలపై అక్కడే శిక్షణ ఇచ్చారు. ఎంసెట్-2 స్కాం విలువ రూ. 15కోట్లుగా సీఐడీ భావిస్తోంది. అడ్వాన్స్ కిందే ఒక్కో విద్యార్థి నుంచి పది లక్షలు వసూలు చేశారు. 2012 పీజీసెట్ పేపర్ లీక్‌లో పాల్గొన్న నిందితులే ఎంసెట్-2 పేపర్‌ను కూడా లీక్ చేసినట్టు సీఐడి నిర్ధారణకు వచ్చింది.