Telugu Global
NEWS

లక్షల కోట్ల గ్యాస్‌పై బాబు చమత్కారాలు " టీడీపీ పత్రిక కథనం

సరిగ్గా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఏపీలో కేజీ బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. కానీ వాటిని చంద్రబాబు రిలయన్స్ కంపెనీకి కట్టబెట్టి తెలుగుప్రజల నోట్లో మట్టి కొట్టిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా కేజీ బేసిన్లోనే మరో భారీ నిక్షేపం బయటపడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్‌ సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మన గ్యాస్ మనకే అంటూ కొత్త నినాదాన్ని పైకి తెచ్చారు. గ్యాస్ మాకు ఇచ్చిన తర్వాతే ఇతర రాష్ట్రాలు […]

లక్షల కోట్ల గ్యాస్‌పై బాబు చమత్కారాలు  టీడీపీ పత్రిక కథనం
X

సరిగ్గా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఏపీలో కేజీ బేసిన్‌లో గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. కానీ వాటిని చంద్రబాబు రిలయన్స్ కంపెనీకి కట్టబెట్టి తెలుగుప్రజల నోట్లో మట్టి కొట్టిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా కేజీ బేసిన్లోనే మరో భారీ నిక్షేపం బయటపడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్‌ సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మన గ్యాస్ మనకే అంటూ కొత్త నినాదాన్ని పైకి తెచ్చారు. గ్యాస్ మాకు ఇచ్చిన తర్వాతే ఇతర రాష్ట్రాలు తీసుకెళ్లాలని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రసాద్‌కు కూడా చెప్పివచ్చానన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంతలోనే లక్షల కోట్ల విలువైన గ్యాస్‌ అంశాన్ని తాను ఎంత సీరియస్‌గా తీసుకున్నానో చాటిచెప్పేలా మరో వ్యాఖ్య చేశారు.

గ్యాస్ మనకు ఇవ్వకపోతే పైపు లైన్లు కూడా వెళ్లవని నవ్వుతూ చమత్కరించారు. ఈ విషయాన్ని బాబును భుజాన వేసుకుని మోసే పత్రిక ఒకటి స్వయంగా రాసింది. చంద్రబాబుకు నిజంగా గ్యాస్‌ను మన రాష్ట్రానికి తీసుకురావాలన్న ఆలోచనే ఉంటే… గట్టిగా మాట్లాడాలి కానీ… చమత్కారాలు, జోకులు వేస్తారా?… అయినా రిలయన్స్ జోబులోమనిషి చంద్రబాబు రిలయన్స్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారా? జోకులు కాకపోతే..! చంద్రబాబు సీరియస్‌గా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని కేంద్రం భావిస్తే ఎక్కడ తన సామ్రాజ్యాలపై దాడులు జరుగుతాయేమోనని, తిరిగి సొంత పత్రికల్లో అవన్నీ చమత్కారం కోసం అన్న మాటలే, సీరియస్‌గా తీసుకోవద్దని బీజేపీ పెద్దలకు సిగ్నల్స్ పంపుతున్నారు. 33లక్షలకోట్ల గ్యాస్ నిక్షేపాలు గుర్తించారన్న విషయం బయటకు వచ్చిన రోజే చంద్రబాబు గ్యాస్ గురించి మాట్లాడడంపైనే చాలా మందికి అనుమానం కలిగింది.

అంటే గతంలో రిలయన్స్‌కు లక్షల కోట్ల కేజీ గ్యాస్‌ను అప్పగించినట్టుగానే ఇప్పుడు కూడా ”మాకు ఇచ్చిన తర్వాతే తీసుకెళ్లాలి” అన్న స్లోగన్ పైకి తీసుకొచ్చి పప్పులుబెల్లం కింద ఏపీకి కొద్దిగా గ్యాస్‌ తీసుకుని మిగిలిన లక్షల కోట్ల గ్యాస్‌ను పరాయివాళ్ల పాలు చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే 2002లో తాను సీఎంగా ఉన్నప్పుడే మన గ్యాస్‌ను రిలయన్స్‌కు దోచిపెట్టిన చంద్రబాబు ఇంతకాలం తర్వాత హఠాత్తుగా ”మన గ్యాస్ మనకే” అన్న నినాదం వినిపించడం ఆశ్చర్యమే. దీని వెనుక ఏదో భారీ కుట్రకు రంగం సిద్ధమవుతోందని చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారే అనుమానిస్తున్నారు.

First Published:  27 July 2016 12:05 AM GMT
Next Story