Telugu Global
NEWS

కాంగ్రెస్‌దే పూర్తి బాధ్యత... మాకూ అవకాశం ఇవ్వండి.

ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు మరోసారి రాజ్యసభను కుదిపేసింది. బిల్లుపై చర్చ, ఓటింగ్‌కు కాంగ్రెస్ పట్టుబట్టింది. కావాలనే బిల్లును అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఎంతో కీలకమైన అంశమని దీనిపై సమగ్ర చర్చ జరపాలని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ బిల్లు చర్చలో పాల్గొనే అవకాశం వైసీపీ లేకుండా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఈ కీలకమైన చర్చలో వైసీపీ తరపున […]

కాంగ్రెస్‌దే పూర్తి బాధ్యత... మాకూ అవకాశం ఇవ్వండి.
X

ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు మరోసారి రాజ్యసభను కుదిపేసింది. బిల్లుపై చర్చ, ఓటింగ్‌కు కాంగ్రెస్ పట్టుబట్టింది. కావాలనే బిల్లును అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని జైరాం రమేష్ ఆరోపించారు. ప్రత్యేక హోదా ఎంతో కీలకమైన అంశమని దీనిపై సమగ్ర చర్చ జరపాలని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ బిల్లు చర్చలో పాల్గొనే అవకాశం వైసీపీ లేకుండా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఈ కీలకమైన చర్చలో వైసీపీ తరపున మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులకు, విభజనకు కాంగ్రెస్ పార్టీయే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు.

బిల్లుపై చర్చ జరిపినప్పుడు మాట్లాడేందుకు తప్పకుండా అవకాశం ఇస్తానని డిప్యూటీ చైర్మన్ కురియన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం వెంటనే ఈ అంశాన్ని చేపట్టాలంటూ నినాదాలు చేశారు. వి వాంట్ ఓటింగ్ అంటూ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ఓటింగ్‌ జరపాలని టీడీపీ సభ్యులు కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడంతో సభను కురియన్ వాయిదా వేశారు.

Click on Image to Read:

anam-vivekananda-reddy

chandrababu-boyapati-sinu

chandrababu-pakistan

babu-jagan

singger sunitha

sunitha

ys-jagan

suresh-babu

jagan-praveen-kumar-reddy

tirupati-asp-sidda-reddy

mahanandi-reddy--murder-pla

chandrababi-toiltes

ongole-ysrcp-Mayo-shamantha

peddi-reddy-dwarakanath

lokesh-1

First Published:  26 July 2016 4:57 AM GMT
Next Story