ఏపీలో తరిమేస్తాం... తెలంగాణలో రెచ్చగొడతాం!
రైతు సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీకి ఒక విధానం అంటూ లేకుండా పోయింది. ఏపీలో నియంతృత్వ పోకడలతో ముందుకు పోతూ… తెలంగాణలో మాత్రం అన్యాయం అంటూ గొంతు చించుకుంటోందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ప్రత్యర్థి పార్టీల పరువు తీయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. ఇదే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయి పార్టీ పరువు గంగలో కలిసినా ఇంకా బుద్ధి రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పక్షాన పోరాడుతున్న టీడీపీ […]
BY sarvi26 July 2016 2:30 AM IST
X
sarvi Updated On: 26 July 2016 6:46 AM IST
రైతు సమస్యల పరిష్కారంలో తెలుగుదేశం పార్టీకి ఒక విధానం అంటూ లేకుండా పోయింది. ఏపీలో నియంతృత్వ పోకడలతో ముందుకు పోతూ… తెలంగాణలో మాత్రం అన్యాయం అంటూ గొంతు చించుకుంటోందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ప్రత్యర్థి పార్టీల పరువు తీయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. ఇదే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయి పార్టీ పరువు గంగలో కలిసినా ఇంకా బుద్ధి రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పక్షాన పోరాడుతున్న టీడీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా వ్యవహరించడం చంద్రబాబు నాయుడు పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేస్తున్నారు. ఏపీలో రైతుల్ని తరిమేస్తాం.. తెలంగాణలో అదే రైతుల్ని రెచ్చగొడతాం అన్న తీరు మార్చుకోవాలని హితవుపలుకుతున్నారు.
మీకు చేతనైతే.. ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు
1. అమరావతి నిర్మాణానికి వేలాది ఎకరాలు సేకరించినపుడు రైతుల సంక్షేమం గుర్తుకురాలేదా?
2. అక్కడ రైతులు భూములు ఇవ్వమని ఖరాకండిగా చెప్పారు. అయినా బలవంతంగా భూ సేకరణ జరిపిన మాట వాస్తవం కాదా?
3. తమను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరిస్తున్నారని రైతులు మీడియా ఎదుట వాపోయిన మాట నిజం కాదా?
4. భూములు ఇవ్వనన్న వారి పంటభూములు అనుమానాస్పదంగా కాలిబూడిదైన మాట వాస్తవం కాదా?
5. మీడియా ముందుకు వచ్చిన రైతులను టీడీపీ నేతలు బెదిరించిన మాట నిజం కాదా?
6. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిన ఘటన నిజం కాదా?
7. మల్లన్నసాగర్ లాఠీఛార్జిలో గాయపడ్డవారికి చికిత్స ఖర్చులు భరిస్తామంటున్న రేవంత్, అమరావతిలో పంటలు దహనమైనవారికి నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు.
8. ఇటీవల చంద్రబాబు భూసేకరణ చేసి తీరుతాం. ఎవరు అడ్డొచ్చినా.. ఉపేక్షించం అన్నమాట వాస్తవం కాదా? భూసేకరణ వద్దు అన్న నీతులు చంద్రబాబుకు చెప్పలేకపోతున్నారా?
9. స్విస్‌ఛాలెంజ్‌లో సుప్రీం నిబంధనలు పాటిస్తున్నారా?
టీడీపీ నేతలు తెలంగాణలో నీతులు చెప్పేముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండని హితవు పలికారు టీఆర్ ఎస్ నేతలు. ప్రజలు మీకు బుద్ధి చెప్పేరోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తున్నారు.
Next Story