నిరాహార దీక్ష విరమిస్తా...ఎన్నికల్లో పోటీ చేస్తా -మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల
పదహారు సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిరాహార దీక్షని విరమించి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తన ఆశయాన్ని, డిమాండ్లను పట్టించుకోకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేసి, తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానని తెలిపారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఎయిర్ పోర్టుకి సమీపంలో ఉన్న ఒక బస్ స్టాప్‌లో 2000వ సంవత్సరంలో అసోం రైఫిల్స్ సైనికులు పదిమంది పౌరులను దారుణంగా వూచకోత […]
పదహారు సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తున్న మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిరాహార దీక్షని విరమించి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తన ఆశయాన్ని, డిమాండ్లను పట్టించుకోకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీచేసి, తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటానని తెలిపారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఎయిర్ పోర్టుకి సమీపంలో ఉన్న ఒక బస్ స్టాప్‌లో 2000వ సంవత్సరంలో అసోం రైఫిల్స్ సైనికులు పదిమంది పౌరులను దారుణంగా వూచకోత కోశారు. దీన్ని నిరసిస్తూ, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల పదహారేళ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 2006లో ఆమెపై నిరాహార దీక్షతో ఆత్మహత్యా యత్నం చేశారనే అభియోగంతో పోలీసులు కేసు పెట్టగా గత మార్చిలో ఈ కేసులో షర్మిల నిర్దోషి అని ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది.
ఈ సందర్భంగా షర్మిల తాను డిమాండ్ చేస్తున్న అంశంపై ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలని ఉందని అన్నారు. తన ప్రాణాలంటే తనకు చాలా ఇష్టమని, లక్ష్యసాధన కోసమే నిరాహార దీక్షను ఎంచుకున్నానని అన్నారు. ముక్కులో ట్యూబ్తో మీడియాలో కనిపించే షర్మిల, మణిపూర్ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. వచ్చేనెల 9న ఆమె తన పదహారేళ్ల దీక్షని విరమించి జనంలోకి వెళ్లనున్నారు.