పరామర్శలో బాబు, జగన్ మధ్య అంత తేడా ఉందా?
ఇటీవల విమానంతో పాటు గల్లంతైన నావీ సిబ్బంది కుటుంబాలను రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు పరామర్శించారు. సోమవారం ప్రతిపక్ష నేత జగన్ వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే పరామర్శ సందర్భంగా చంద్రబాబు, జగన్ వ్యవహారశైలిని పోలుస్తూ ఒక పత్రిక కథనాన్ని రాసింది. విమానంలో గల్లంతైన వారిలో ఆరుగురు విశాఖవాసులున్నారు. చంద్రబాబు పరామర్శించింది ముగ్గురినే అన్నది ఆ పత్రిక కథనం. ఆ ముగ్గురిలోనూ నేరుగా ఇంటికి వెళ్లి ఒక్కరిని మాత్రమే చంద్రబాబు పరామర్శించారు. మరొక కుటుంబాన్ని విమానాశ్రయానికే […]
ఇటీవల విమానంతో పాటు గల్లంతైన నావీ సిబ్బంది కుటుంబాలను రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు పరామర్శించారు. సోమవారం ప్రతిపక్ష నేత జగన్ వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే పరామర్శ సందర్భంగా చంద్రబాబు, జగన్ వ్యవహారశైలిని పోలుస్తూ ఒక పత్రిక కథనాన్ని రాసింది.
విమానంలో గల్లంతైన వారిలో ఆరుగురు విశాఖవాసులున్నారు. చంద్రబాబు పరామర్శించింది ముగ్గురినే అన్నది ఆ పత్రిక కథనం. ఆ ముగ్గురిలోనూ నేరుగా ఇంటికి వెళ్లి ఒక్కరిని మాత్రమే చంద్రబాబు పరామర్శించారు. మరొక కుటుంబాన్ని విమానాశ్రయానికే పిలిపించుకున్నారు. మరో బాధితకుటుంబం ఇంటి వరకు వెళ్లి వారితో వీధిలోనే మాట్లాడేసి చంద్రబాబు తిరిగొచ్చారు. ఇంటి పెద్దదిక్కు అదృశ్యమై బాధితులు బాధపడుతుంటే వారిని విమానాశ్రయానికి పిలిపించుకుని పరామర్శించడం ఏమిటని విమర్శలు వస్తున్నాయట.
జగన్ మాత్రం ఆరుగురి ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని పరామర్శించారు. గతంలో తన తండ్రి హెలికాప్టర్ మిస్ అయినప్పుడు తాము పడ్డ బాధను కూడా వారికి వివరించి ధైర్యం చెప్పారట జగన్. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని కుటుంబాలను పరామర్శించే తీరిక ఉండకపోచ్చు.
Click on Image to Read: