చంద్రబాబే స్వయంగా వింటున్నారట....
గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ యావకు 30 మంది అమాయకులు బలైపోయారు. షార్ట్ ఫిల్మ్ కోసం రకరకాల యాంగిల్స్ దృశ్యాలను రికార్డు చేసే ఉద్దేశంతో గంటల కొద్ది పుష్కరఘాట్ వద్ద చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు గడిపారు. దీంతో లక్షలాది మంది భక్తులు ఒకేచోట స్తంభించిపోయారు. దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో బాబు దృశ్యకావ్యం చిత్రీకరణ పూర్తి కాగానే ఒక్కసారిగా గేట్లు తెరిచారు. దీంతో లక్షలాది మంది తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇంత జరిగినా […]
గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు పబ్లిసిటీ యావకు 30 మంది అమాయకులు బలైపోయారు. షార్ట్ ఫిల్మ్ కోసం రకరకాల యాంగిల్స్ దృశ్యాలను రికార్డు చేసే ఉద్దేశంతో గంటల కొద్ది పుష్కరఘాట్ వద్ద చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు గడిపారు. దీంతో లక్షలాది మంది భక్తులు ఒకేచోట స్తంభించిపోయారు. దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో బాబు దృశ్యకావ్యం చిత్రీకరణ పూర్తి కాగానే ఒక్కసారిగా గేట్లు తెరిచారు. దీంతో లక్షలాది మంది తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇంత జరిగినా కూడా చంద్రబాబులో మార్పు వచ్చినట్టుగా కనిపించడం లేదు.
ఈసారి కృష్ణాపుష్కరాల్లోనూ షార్ట్ ఫిల్మ్ తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రభూమి పత్రిక కూడా ప్రచురించింది. ఈసారి కూడా బోయపాటే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించనున్నారు. పుష్కరాల్లో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు స్నానమాచరించడం నుంచి భక్తుల విజువల్స్ చిత్రీకరణ వరకు అంతా బోయపాటి డైరెక్షన్‌లోనే జరుగుతుందని సమాచారం. షార్ట్ ఫిల్మ్‌కు వాయిస్ ఓవర్ నటుడు సాయికుమార్ ఇస్తారు. పాటలను జొన్నవిత్తులు రాస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడుతారు. పాటలను చంద్రబాబే స్వయంగా విని ఓకే చేస్తున్నారని ఆంధ్రభూమి పత్రిక కథనం. ఈసారి చంద్రబాబు ప్రభుత్వం చేసే విన్యాసాలతో పుష్కరాలు ఎలా జరుగుతాయో!. అయినా పుష్కరాల్లో పబ్లిసిటీ యావ ఏంటో!. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం సైలెంట్ గా పనిచేస్తుంటే ఏపీలో మాత్రం షార్ట్ ఫిల్మ్ లు, చిత్రవిచిత్రాలు ఎందుకో!.
Click on Image to Read: