టీడీపీ, సీపీఎం నాయకులపై కేసులు!
మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళనలో పాల్గొన్న టీడీపీ, సీపీఎం కార్యకర్తలు, నాయకులపై కేసుల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. జపాన్ పర్యనటను ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్న మంత్రి హరీశ్ రావు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆందోళనకారుల ముసుగులో టీడీపీ, సీపీఎం నేతలు పోలీసులపై పథకం ప్రకారం.. దాడులు చేశారని ఆరోపిస్తున్నారు మంత్రి హరీశ్‌రావు. విధిలేక, ఆత్మరక్షణ కోసమే లాఠీఛార్జి జరపాల్సి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతును ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడులకు గురిచేయడం లేదని […]
BY sarvi26 July 2016 2:30 AM IST
X
sarvi Updated On: 26 July 2016 5:40 AM IST
మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళనలో పాల్గొన్న టీడీపీ, సీపీఎం కార్యకర్తలు, నాయకులపై కేసుల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. జపాన్ పర్యనటను ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్న మంత్రి హరీశ్ రావు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆందోళనకారుల ముసుగులో టీడీపీ, సీపీఎం నేతలు పోలీసులపై పథకం ప్రకారం.. దాడులు చేశారని ఆరోపిస్తున్నారు మంత్రి హరీశ్‌రావు. విధిలేక, ఆత్మరక్షణ కోసమే లాఠీఛార్జి జరపాల్సి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతును ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడులకు గురిచేయడం లేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. టీడీపీ, సీపీఎంలకు పుట్టగతులు ఉండవనే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంటేరు ప్రతాపరెడ్డి, ఆయన అనుచరులు, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారని మంత్రి ఆరోపిస్తున్నారు. రైతుల ముసుగులో ధర్నాలో దూరిన వీరంతా కావాలనే పోలీసులను రెచ్చగొట్టి లాఠీచార్జికి కారణమయ్యారని మంత్రి ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించేపనిలో పడ్డారు మెదక్ పోలీసులు. ధర్నాకు ఎవరెవరు వచ్చారు? ఎక్కడ నుంచి వచ్చారు? ఎవరెవరు పాల్గొన్నారు? వంటి సమాచారం సేకరించేందుకు అక్కడ కవరేజీకి వచ్చిన పాత్రికేయులు సహకారం తీసుకుంటున్నారని తెలిసింది. లాఠీచార్జి సంఘటనకు ముందు రాళ్లు విసిరిన వారిని వీటి ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రభుత్వం వాదిస్తున్నట్లుగా రాళ్లు విసిరినవారిలో టీడీపీ, సీపీఎం నాయకులు ఉన్నట్లు తేలితే .. వారిపై తప్పకుండా కేసులు నమోదు అవుతాయి. జరిగిన ఘటనపై ఇప్పటికే నిఘావర్గాలు నివేదిక అందజేసినట్లు తెలిసింది. వీటికితోడుగా టీవీ జర్నలిస్టుల కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీల సహకారంతో పోలీసులు ముందుకు వెళ్లనున్నారు.
Next Story