తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షమా, మిత్రపక్షమా!
కేంద్రం దయతోనే తెలంగాణ సర్కారు మనుగడ సాగించగలుగుతోంది.. మేం లేకుంటే తెలంగాణలో అభివృద్ధికి అవకాశమే లేదు.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి బీజేపీ దయ.. కేసీఆర్ ఏమీ చేయడం లేదు.. 2019లో తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి వస్తాం.. – కె.లక్ష్మణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ మాకు మిత్రులే, కేటీఆర్‌కు […]
BY sarvi26 July 2016 4:42 AM IST
X
sarvi Updated On: 26 July 2016 6:42 AM IST
కేంద్రం దయతోనే తెలంగాణ సర్కారు మనుగడ సాగించగలుగుతోంది..
మేం లేకుంటే తెలంగాణలో అభివృద్ధికి అవకాశమే లేదు..
ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి బీజేపీ దయ.. కేసీఆర్ ఏమీ చేయడం లేదు..
2019లో తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి వస్తాం..
– కె.లక్ష్మణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ మాకు మిత్రులే,
కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు,
– కె.లక్ష్మణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఈ రెండు మాటలు అన్నది ఎవరో కాదు.. బీజేపీ నేతలే.. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ.. కార్యకర్తలను గందరగోళంలోనికి నెట్టేస్తున్నారు తెలంగాణ కమలనాథులు. దీంతో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఏమీ అర్థం కావడం లేదు. ఇంతకీ అధికారపార్టీకి మా నాయకులు మిత్రులా? లేక విరోధులా అన్న విషయంపై జుట్టు పీక్కుంటున్నారు. దీనిపై మీడియా ప్రతినిధులకు కూడా పలు సందేహాలు వచ్చాయి. ఇంతకీ బీజేపీ పార్టీ – తెలంగాణ సర్కారుకు మిత్రపక్షమా? ప‌్రతిపక్షమా ? అన్నవిషయం వారికీ అర్థంకాలేదు.
తెలంగాణ బీజేపీ అగ్రనాయకుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో కొందరు నాయకులు ఏకంగా అగ్రనాయకులనే ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయం మీడియాకు లీకైంది. దీంతో తెలంగాణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ను వారు ఇదే విషయమై ప్రశ్నించగా.. కలిసి మెదిలినంత మాత్రాన.. మాపార్టీ లక్ష్యాలు, ఎజెండాను మరిచిపోలేము కదా! ఎవరి లక్ష్యాల కోసం వారు ప్రయత్నాలు చేయాల్సిందే. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తే..మిత్ర పక్షంగా మారినట్లేనా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో కార్యకర్తల్లో కొంత క్లారిటీ వచ్చింది. మొత్తానికి బీజేపీ తెలంగాణలో ప్రతిపక్షమేనని సరిపెట్టుకున్నారు.
Next Story