ప్రవీణ్ కుమార్ రెడ్డికి క్లారిటీ ఇచ్చిన జగన్
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డికి వైసీపీ అధ్యక్షుడు గట్టి షాకే ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఆయనను జగన్ దాదాపు దూరం పెట్టేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గ వైసీపీ సమయ్యకర్తగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని నియమించారు. 2014 ఎన్నికలు ముగిసినప్పటినుంచి ప్రవీణ్ కుమార్‌రెడ్డి పార్టీ గురించి పనిచేయడం మానేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని వైసీపీ వాదన. అంతేకాదు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు వైసీపీ కార్యక్రమానికి […]
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ రెడ్డికి వైసీపీ అధ్యక్షుడు గట్టి షాకే ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఆయనను జగన్ దాదాపు దూరం పెట్టేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గ వైసీపీ సమయ్యకర్తగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని నియమించారు. 2014 ఎన్నికలు ముగిసినప్పటినుంచి ప్రవీణ్ కుమార్‌రెడ్డి పార్టీ గురించి పనిచేయడం మానేశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని వైసీపీ వాదన. అంతేకాదు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు వైసీపీ కార్యక్రమానికి ప్రవీణ్ దూరంగా ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంలో కార్యక్రమం దాదాపు ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్‌కుమార్ రెడ్డిని పక్కన పెట్టి పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ఇకపై నియోజకవర్గంలోని అన్ని కార్యక్రమాలను ద్వారకనాథరెడ్డే సమన్వయం చేసుకుంటారని వైసీపీ ప్రకటించింది. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 2014కు ముందు వైసీపీలో చేరారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడం మానేశారు. దీని వల్లే ప్రవీణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టినట్టు భావిస్తున్నారు. ఒక విధంగా ప్రవీణ్ కుమార్ రెడ్డికి జగన్ క్లారిటీ ఇచ్చినట్టుగానే భావిస్తున్నారు. పైగా తంబళ్లపల్లిలో సరైన నాయకత్వం లేకపోవడం వల్లే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారని స్వయంగా జగన్ మీడియాలోనే కథనం రావడం ఆసక్తిగా ఉంది. ఇక ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏదారి చూసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్న. మొత్తం మీద గడపగడప వైసీపీ కార్యక్రమంపై వైసీపీ అధినేత ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టుగా ఉంది. ప్రవీణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టడం మిగిలిన నాయకులకు కూడా హెచ్చరికలాంటిదేనంటున్నారు.
Click on Image to Read: