వన్యప్రాణుల వేట కేసులో...సల్మాన్ నిర్దోషి " రాజస్థాన్ హైకోర్టు
వన్యప్రాణులను వేటాడిన రెండు కేసుల్లో బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా పేర్కొంది. దీంతో కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నఈ కేసుల్లో సల్మాన్‌ఖాన్‌కి ఊరట లభించింది. సోమవారం కోర్టు ఈ తీర్పుని వెలువరించింది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగుకి వెళ్లినపుడు జోథ్పూర్ శివారుల్లోని అటవీ ప్రాంతంలో సల్మాన్ ఖాన్ రక్షిత వన్య ప్రాణి అయిన ఓ కృష్ణ జింకను, ఓ మాములు జింకను వేటాడి చంపినట్టుగా ఆరోపణలు రావటంతో పోలీసులు ఆయనపై […]

వన్యప్రాణులను వేటాడిన రెండు కేసుల్లో బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా పేర్కొంది. దీంతో కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్నఈ కేసుల్లో సల్మాన్‌ఖాన్‌కి ఊరట లభించింది. సోమవారం కోర్టు ఈ తీర్పుని వెలువరించింది. 1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగుకి వెళ్లినపుడు జోథ్పూర్ శివారుల్లోని అటవీ ప్రాంతంలో సల్మాన్ ఖాన్ రక్షిత వన్య ప్రాణి అయిన ఓ కృష్ణ జింకను, ఓ మాములు జింకను వేటాడి చంపినట్టుగా ఆరోపణలు రావటంతో పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. జోథ్పూర్ కోర్టు ఈ రెండు కేసుల్లో సల్మాన్‌కి ఏడాది, ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. స్థానిక కోర్టు తీర్పుపై సల్మాన్ హైకోర్టుకి వెళ్లారు. మే చివరి వారంలో ఈ కేసుకి సంబంధించిన వాదనలు పూర్తవగా కోర్టు తీర్పుని రిజర్వులో ఉంచింది. సోమవారం తుదితీర్పుని వెలువరించిన రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ ఖాన్ని నిర్దోషిగా ప్రకటించింది.