మహానందిరెడ్డి హత్య కుట్ర భగ్నం
డోన్ ప్రాంతంలో మైనింగ్ వ్యాపారుల మధ్య పోటీ హత్యల వరకు చేరింది. 2013 ఏప్రిల్‌లో లీలావతి మైనింగ్ కంపెనీ యజమాని శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మహానందిరెడ్డిని హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. శ్రీనివాస్ రెడ్డి హత్య కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు కర్నూలు వెళ్తున్న సమయంలో చినమాల్కాపురం రైల్వే స్టేషన్‌లోనే మహానందిరెడ్డిని మట్టుపెట్టేందుకు కిరాయి ముఠా మాటువేసింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన మహానందిరెడ్డి వర్గీయులు పోలీసులకు […]
డోన్ ప్రాంతంలో మైనింగ్ వ్యాపారుల మధ్య పోటీ హత్యల వరకు చేరింది. 2013 ఏప్రిల్‌లో లీలావతి మైనింగ్ కంపెనీ యజమాని శ్రీనివాస్ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మహానందిరెడ్డిని హత్య చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. శ్రీనివాస్ రెడ్డి హత్య కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు కర్నూలు వెళ్తున్న సమయంలో చినమాల్కాపురం రైల్వే స్టేషన్‌లోనే మహానందిరెడ్డిని మట్టుపెట్టేందుకు కిరాయి ముఠా మాటువేసింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన మహానందిరెడ్డి వర్గీయులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బాంబులు, వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 మంది సభ్యుల ముఠా ఈ హత్య కోసం పనిచేస్తున్నట్టు గుర్తించారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు.
2013 ఏప్రిల్‌లో చినమాల్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కర్నూలు వెళ్లి వస్తున్న సమయంలో హత్యకు అదే గ్రామానికి చెందిన మహానందిరెడ్డి వర్గం మాటువేసింది. శ్రీనివాసరెడ్డి కర్నూలులో పని ముగించుకుని తన తండ్రి ఖాదర్‌రెడ్డితో కలిసి అర్ధరాత్రి స్కార్పియోలో చినమల్కాపురం వస్తుండగా బ్రిడ్జి వద్దకు రాగానే ప్రత్యర్థులు దాడి చేశారు. ఇన్నోవా, ఇండికా కార్లలో వచ్చిన దుండగులు వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి అటాక్ చేశారు. శ్రీనివాసరెడ్డి, అతని తండ్రి ఖాదర్‌రెడ్డి కళ్లల్లో కారం చల్లి వేటకొడవళ్లతో నరికి పరారయ్యారు. శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా … ఆయన తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు మహానందిరెడ్డి హత్యకు కుట్ర చేసినట్టు భావిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిని పోలీసులు విచారిస్తున్నారు.
Click on Image to Read: