ఆ ముసుగుతీసేయమ్మ... ఆ అవసరానికి కారులో బెజవాడ వెళ్లాలా?
దేశంలో స్వచ్చభారత్ గురించి ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం అంతాఇంతా కాదు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన ప్రకటన మరింత ప్రాచుర్యం పొందింది. మరుగుదొడ్డి లేని ఇంటిని తప్పుపడుతూ ”ఆ ముసుగు తీసేయమ్మ… ఆ అవసరానికి ఊరిబయటకు వెళ్లాలి గానీ ఇక్కడ మాత్రం ముసుగేసుకోవాలా” అని విద్యాబాలన్ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిలోనూ అదే పరిస్థితి ఉంది. ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు నోచుకున్న తాత్కాలిక రాజధాని ఇంకా పూర్తి కాలేదు. తాజాగా తాత్కాలిక రాజధాని పరువు […]
దేశంలో స్వచ్చభారత్ గురించి ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం అంతాఇంతా కాదు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన ప్రకటన మరింత ప్రాచుర్యం పొందింది. మరుగుదొడ్డి లేని ఇంటిని తప్పుపడుతూ ”ఆ ముసుగు తీసేయమ్మ… ఆ అవసరానికి ఊరిబయటకు వెళ్లాలి గానీ ఇక్కడ మాత్రం ముసుగేసుకోవాలా” అని విద్యాబాలన్ ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిలోనూ అదే పరిస్థితి ఉంది.
ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు నోచుకున్న తాత్కాలిక రాజధాని ఇంకా పూర్తి కాలేదు. తాజాగా తాత్కాలిక రాజధాని పరువు గంగలో కలిసే అంశాన్ని ఒక ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. “నో టాయిలెట్స్ గూరూ” అంటూ పెద్ద కథనాన్ని రాసింది. తాత్కాలిక రాజధాని సర్వాంగసుందరంగా తయారైందని చంద్రబాబు, ఆయన మీడియా కోడై కూసింది. దీనికి తోడు ఉద్యోగ సంఘాల నేతలు కూడా బాబుకు వంతపాడడంతో ఉద్యోగులు బలవంతంగానే హైదరాబాద్ నుంచి వెలగపూడి వెళ్లాల్సి వచ్చింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే కనీస సౌకర్యాలు కూడా లేవు.
విజిలెన్స్ కమిషనర్ ఎస్ విప్రసాద్ తమ కార్యాలయానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కానీ సిబ్బంది లోనికి వెళ్లి చూస్తే అక్కడ టాయిలెట్లు కూడా లేవు. దీంతో ఉద్యోగులంతా షాక్ అయ్యారు. ఒక అధికారి అత్యవసరమై ఏకంగా కారు తీసుకుని వేగంగా విజయవాడ వెళ్లి వచ్చారట. దీంతో 50 మందితో కూడిన ఉద్యోగుల బృందం 24 గంటలు కూడా గడవకముందే తిరిగి హైదరాబాద్ వచ్చేసిందని కథనం. కనీసం కంప్యూటర్లకు వైర్లు కూడా అమర్చలేదట. మిగిలిన శాఖల ఉద్యోగులు కూడా వెలగపూడి వదిలి హైదరాబాద్ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్ణీత గడుపులో భవనాలు పూర్తి చేస్తారంటూ తనకు ఇష్టమైన కంపెనీకి అత్యధిక ధరకు చంద్రబాబు కాంట్రాక్ట్ కట్టబెట్టిన తర్వాత కూడా వెలగపూడిలో తాత్కాలిక రాజధాని పరిస్థితి ఇది. మొత్తం మీద వెలగపూడిలో ఎంత సర్దుకుపోయి పనిచేయాలన్నా కనీసం టాయిలెట్లు లేవన్న మాట. అంటే ఉద్యోగులు అక్కడికి వెళ్లాలంటే బ్యాగులో ఒక చెంబు నీరు కూడా తీసుకుని వెళ్లడం మంచిదన్న మాట.
Click on Image to Read: