కబాలి టికెట్ దొరకలేదని యువకుడి ఆత్మహత్య!
ఇండియాలో హీరోలంటే పడిచస్తారన్న విషయం తెలుసుగానీ.. నిజంగానే పడి చస్తారని నిరూపించాడు మలేసియాకు చెందిన ఓ అభిమాని. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు నెలకొల్పిన కబాలి సినిమా మొదటి రోజు చూడాలని అందరూ కోరుకున్నట్లే ఆ యువకుడు కూడా కోరుకున్నాడు. కానీ, టికెట్ దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు ఆ యువకుడు. అంతే, ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మలేషియాలోని ఓ బహుళ అంతస్తుల భవనం ఎక్కి అక్కడ నుంచి అందరూ చూస్తుండగానే దూకేశాడు. […]
BY sarvi24 July 2016 7:03 AM IST
X
sarvi Updated On: 24 July 2016 7:11 AM IST
ఇండియాలో హీరోలంటే పడిచస్తారన్న విషయం తెలుసుగానీ.. నిజంగానే పడి చస్తారని నిరూపించాడు మలేసియాకు చెందిన ఓ అభిమాని. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు నెలకొల్పిన కబాలి సినిమా మొదటి రోజు చూడాలని అందరూ కోరుకున్నట్లే ఆ యువకుడు కూడా కోరుకున్నాడు. కానీ, టికెట్ దొరకలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు ఆ యువకుడు. అంతే, ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మలేషియాలోని ఓ బహుళ అంతస్తుల భవనం ఎక్కి అక్కడ నుంచి అందరూ చూస్తుండగానే దూకేశాడు. దూకిన యువకుడు మలేసియాలో నివసిస్తున్న ఓ తమిళుడు అని తెలిసింది. ఆ యువకుడు భవనం మీద నుంచి దూకుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ యువకుడు పేరు ఇతర వివరాలు తెలియరాలేదు గానీ, రజినీకాంత్‌తో ఆ యువకుడు తీసుకున్న ఫొటో మాత్రం అతని వద్ద లభించింది.
Next Story