Telugu Global
NEWS

హైద‌రాబాద్ వ‌స్తున్నారా... ఆధార్ మ‌రిచిపోవ‌ద్దు!

మీరు న‌గ‌ర‌వాసులేనా?  లేక హైదరాబాద్‌లో ఏదైనా ప‌ని ఉండి మీ మిత్రులెవ‌రైనా న‌గ‌రానికి వ‌స్తున్నారా? అయితే, త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిందే! అదేంటి..? స‌ంక్షేమ ప‌థ‌కాల‌కు, న‌గ‌దుబ‌దిలీల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి అనితెలుసు కానీ, ఇదేంటి.. హైద‌రాబాద్ లో రోడ్డెక్కినా ఆధార్ త‌ప్ప‌నిస‌రా?  కొంచెం కొత్త‌గా.. కాస్త‌ వింత‌గా ఉన్నా.. ఇది వాస్త‌వం. ఇటీవ‌ల పంజాగుట్ట స‌మీపంలో కొంద‌రు యువ‌కులు ప‌ట్ట‌ప‌గ‌లే త‌ప్ప‌తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఘ‌ట‌న‌లో చిన్నారి ర‌మ్య‌తోపాటు ఆమె బాబాయి, తాత‌య్య మృతి […]

హైద‌రాబాద్ వ‌స్తున్నారా... ఆధార్ మ‌రిచిపోవ‌ద్దు!
X
మీరు న‌గ‌ర‌వాసులేనా? లేక హైదరాబాద్‌లో ఏదైనా ప‌ని ఉండి మీ మిత్రులెవ‌రైనా న‌గ‌రానికి వ‌స్తున్నారా? అయితే, త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిందే! అదేంటి..? స‌ంక్షేమ ప‌థ‌కాల‌కు, న‌గ‌దుబ‌దిలీల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి అనితెలుసు కానీ, ఇదేంటి.. హైద‌రాబాద్ లో రోడ్డెక్కినా ఆధార్ త‌ప్ప‌నిస‌రా? కొంచెం కొత్త‌గా.. కాస్త‌ వింత‌గా ఉన్నా.. ఇది వాస్త‌వం. ఇటీవ‌ల పంజాగుట్ట స‌మీపంలో కొంద‌రు యువ‌కులు ప‌ట్ట‌ప‌గ‌లే త‌ప్ప‌తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఘ‌ట‌న‌లో చిన్నారి ర‌మ్య‌తోపాటు ఆమె బాబాయి, తాత‌య్య మృతి చెందిన విష‌యం తెలిసిందే! న‌గ‌రంలో డ్రైవింగ్ లైసెన్సులు, స‌రైన డాక్యుమెంట్లు లేకుండా వాహనాలు న‌డిపే వారి సంఖ్య పెరిగిపోతోంది. జ‌రుగుతున్న ప్ర‌మాదాల్లో ఎక్కువ శాతం వీరివ‌ల్లేన‌ని పోలీసులు చెబుతున్నారు. ఎలాంటి అనుభ‌వం లేని, నిబంధ‌న‌లు పాటించ‌నివారి ప‌ని ప‌ట్టేందుకు న‌గ‌ర పోలీసులు కంక‌ణం క‌ట్టుకున్నారు.
మీరు సొంత వాహ‌నంలో వ‌స్తున్నా.. మీ రిజిస్ట్రేష‌న్ ఇత‌ర డాక్యుమెంట్లు అన్నీ స‌రిగ్గానే ఉన్నా.. స‌రే.. ఆధార్ వెంట తీసుకురావాల్సిందే..! లేకుంటే వాహ‌నం జ‌ప్తు చేస్తారు. ర‌మ్య మృతి త‌రువాత కొంద‌రు 21 ఏళ్ల లోపు యువ‌కులు మ‌ద్యం తాగేందుకు బార్‌లో ప్ర‌వేశించాల‌నుకున్నారు. పుట్టిన‌రోజు ధ్రువప‌రుచుకునేందుకు.. నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు సృష్టించారు. కానీ పోలీసుల త‌నిఖీల్లో దొరికిపోయారు. ఇలాంటి వారి ఆట‌క‌ట్టించేందుకు ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి నిబంధ‌న‌ను అమ‌లు చేయ‌నున్నారు న‌గ‌ర పోలీసులు. ఈ నెల 27 నుంచి ఆధార్ కోసం ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌డ‌తామ‌ని.. వాహ‌న‌దారులంతా ఆధార్ కార్డుల‌ను విధిగా ద‌గ్గ‌ర ఉంచుకోవాల‌ని పోలీసులు మీడియా ద్వారా విజ్ఞ‌ప్తి చేశారు.
First Published:  24 July 2016 4:37 AM IST
Next Story