ఒడిశాలో కేటీఆర్ శిల్పం!
ఒడిశాలో కేటీఆర్ శిల్పమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఈ వార్త నిజమే.. అది విగ్రహం కాదు.. శిల్పమే.. మామూలు శిల్పం కాదు.. సైకత శిల్పం. గత రెండురోజులుగా ఒడిశాలోని పూరీ తీరంలోని ఇసుకపై అందంగా తీర్చిదిద్దిన సైకత శిల్పం కోసం ఏర్పాట్లు జరిగాయి. దీన్ని ఒడిశాకు చెందిన సైకత శిల్పకారుడు మానస్ కుమార్ రూపొందించాడు. ఆయన కేటీఆర్ సైకత శిల్పం ఎందుకు చేశాడంటే..? ఇదంతా టీఆర్ ఎస్ యూత్ వింగ్ ఆలోచన. ఆదివారం ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు. […]
BY sarvi23 July 2016 2:30 AM IST
X
sarvi Updated On: 23 July 2016 5:46 AM IST
ఒడిశాలో కేటీఆర్ శిల్పమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? ఈ వార్త నిజమే.. అది విగ్రహం కాదు.. శిల్పమే.. మామూలు శిల్పం కాదు.. సైకత శిల్పం. గత రెండురోజులుగా ఒడిశాలోని పూరీ తీరంలోని ఇసుకపై అందంగా తీర్చిదిద్దిన సైకత శిల్పం కోసం ఏర్పాట్లు జరిగాయి. దీన్ని ఒడిశాకు చెందిన సైకత శిల్పకారుడు మానస్ కుమార్ రూపొందించాడు. ఆయన కేటీఆర్ సైకత శిల్పం ఎందుకు చేశాడంటే..? ఇదంతా టీఆర్ ఎస్ యూత్ వింగ్ ఆలోచన.
ఆదివారం ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు. అందుకే ఆయనకు వైవిధ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకున్నాడు గ్రేటర్ టీఆర్ ఎస్ ఇన్‌ఛార్జి పాటిమీది జగన్ మోహన్ రావు. అందుకే, ఒడిశాలోని పూరీ బీచ్‌లో కేటీఆర్ సైకత శిల్పం చెక్కించి దానిమీద పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాయించాడు. అంతేనా.. కేటీర్ విగ్రహంతోపాటు తెలంగాణ రాష్ట్ర చిత్ర పటం, గూగుల్, అమేజాన్ వంటి ఎంఎన్ సీ కంపెనీల లోగోలు కూడా శిల్పంలో ఉన్నాయి. ఆయా కంపెనీలతో ఒప్పందంలో కేటీఆర్ కీలకంగా వ్యవహరించి విజయం సాధించినందుకు సూచనగా వాటిని ఇందులో చేర్చారు. మొత్తానికి కేటీఆర్‌కు ఈసారి వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పడంలో ఇలా ప్లాన్ చేసి అదరగొట్టారు ఆ పార్టీ యువజన విభాగం నేతలు.
Next Story