Telugu Global
NEWS

ఫస్ట్‌ డే రికార్డులు బద్దలు కొట్టిన కబాలి

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన కబాలి చిత్రం రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. మరే భారతీయ చిత్రం సాధించిన రీతిలో ఒక్క రోజులోనే 100 కోట్లు కొల్లగొట్టింది. బహుబలితో పాటు మరే చిత్రం కూడా కబాలి దరిదాపుల్లో లేవు. కబాలి తొలి రోజు కలెక్షన్లపై ఆ చిత్ర నిర్మాతే స్వయంగా ప్రకటన చేశారు. తొలిరోజు కలెక్షన్ల వివరాలు పూర్తి స్థాయిలో రావాల్సి ఉందంటూనే… కనీసం వంద కోట్లు ఖాయమని నిర్మాత కలైపులి ఎస్‌. థను […]

ఫస్ట్‌ డే రికార్డులు బద్దలు కొట్టిన కబాలి
X

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన కబాలి చిత్రం రికార్డులను తిరగరాస్తోంది. తొలి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. మరే భారతీయ చిత్రం సాధించిన రీతిలో ఒక్క రోజులోనే 100 కోట్లు కొల్లగొట్టింది. బహుబలితో పాటు మరే చిత్రం కూడా కబాలి దరిదాపుల్లో లేవు. కబాలి తొలి రోజు కలెక్షన్లపై ఆ చిత్ర నిర్మాతే స్వయంగా ప్రకటన చేశారు. తొలిరోజు కలెక్షన్ల వివరాలు పూర్తి స్థాయిలో రావాల్సి ఉందంటూనే… కనీసం వంద కోట్లు ఖాయమని నిర్మాత కలైపులి ఎస్‌. థను వెల్లడించారు.

దేవుడు దయ వల్ల చిత్రం ఊహించిన దాని కంటే బ్రహ్మాండంగా ఆడుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా బహుబలి 10వేల స్కీన్లపై విడుదలైంది. యూఎస్‌లోనూ తొలిరోజు అత్యదిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కబాలి నిలిచింది. ఇప్పటివరకు భారతదేశంలో ఏ నటుడికీ ఇంత పెద్ద స్థాయిలో కలెక్షన్లు రాలేదని నిర్మాత థను చెప్పారు. దీన్ని బట్టి దేశం మొత్తం మీద సూపర్ స్టార్ ఒకరేనని అది రజనీకాంత్‌ మాత్రమేనని థను చెప్పారు. తొలి రోజే వంద కోట్లు కొల్లగొట్టిన కబాలి… ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు. ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ అదర్శ్‌ చెప్పిన దాని ప్రకారం బహుబలి చిత్రం అప్పట్లో తొలి రోజు 50 కోట్లు వసూలు చేసింది.

First Published:  23 July 2016 8:19 AM IST
Next Story